కన్నడ రాజకీయాలు మారోసారి ఇంట్రెస్టింగ్ గా మారాయి. లోక్ సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నాటకీయంగా పొత్తులతో సీఎం పదవిని అందుకున్న జనతా దళ్ (సెక్యులర్) పార్టీ అధినేత కుమారస్వామి ఈ ఎలక్షన్స్ లో ఎలాగైనా మెజారిటీ స్థానాలను అందుకోవాలను చూస్తున్నాడు. 

అయితే మిత్ర పక్షమైన కాంగ్రెస్ నుంచి కొన్ని ఒత్తిడులు తలెత్తుతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఎలక్షన్ లో కుటుంబ సభ్యులను బాగానే దింపుతున్న కుమారస్వామి వర్గం ఇప్పుడు రాజకీయాలను తాకని తన కొడుకు నిఖిల్ గౌడను కూడా ఎలక్షన్ లో ఉపయోగించుకుంటున్నాడు. మొదటి సినిమా జాగ్వార్ సినిమాతో బొక్కా బోర్లా పడ్డ ఈ హీరో నెక్స్ట్ సరైనోడు పోలికలతో ఉన్న సినిమా చేసి హిట్టు కొట్టాడు. 

ఆ సినిమాతో కర్ణాటకలో మనోడి రేంజ్ పెరిగిందని కుమారస్వామి ఎన్నికల సమయంలో కొడుకును దింపుతున్నాడు. మాండ్య లోక్ సభ స్థానం అతనికి ఇవ్వడానికి కుమారస్వామి ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ప్రచారాలను చేయించడానికి సిద్దమవుతున్నాడు. కానీ మిత్రవర్గం కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. వ్యతిరేకత వస్తుండడంతో  ఈ ఎన్నికల్లో నిఖిల్ గౌడకు ఓటమి తప్పదని టాక్ వస్తోంది.