కన్నడ ప్రముఖ హీరో విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన స్పందన గుండెపోటు కారణంగా అకాల మరణం చెందారు. విజయ్ రాఘవేంద్ర, స్పందన ఇద్దరూ ఫ్యామిలీతో కలసి తమ 16 వ వెడ్డింగ్ యానవర్సరీ జరుపుకునేందుకు బ్యాంకాక్ వెళ్లినట్లు తెలుస్తోంది.
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి విషాదం ఎదురవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పిన్న వయసులోనే కొందరు నటులు కన్ను మూస్తున్నారు. కన్నడ ప్రముఖ హీరో విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన స్పందన గుండెపోటు కారణంగా అకాల మరణం చెందారు.
విజయ్ రాఘవేంద్ర, స్పందన ఇద్దరూ ఫ్యామిలీతో కలసి తమ 16 వ వెడ్డింగ్ యానవర్సరీ జరుపుకునేందుకు బ్యాంకాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ఆమెకి గుండెపోటు రావడంతో మరణించారు. ఈ వార్తతో శాండల్ వుడ్ ఇండస్ట్రీ, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పిన్న వయసులోనే స్పందన మరణించడంతో జీర్ణించుకోలేకున్నారు. అందుతున్న సమాచారం మేరకు స్పందన తక్కువ బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతోందట. ఆ కారణంగానే గుండె పోటు సంభవించినట్లు చెబుతున్నారు. తనకి చెస్ట్ లో నొప్పి ఉందని చెప్పగానే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే స్పందన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఆమె పార్థివ దేహం మంగళవారం రోజు బెంగుళూరుకి చేరుతుందని అంటున్నారు. అంత్య క్రియలు కూడా మంగళవారమే నిర్వహిస్తారట. స్పందన నటిగా కూడా కొన్ని చిత్రాలు చేసింది. ఆ తర్వాత తన భర్త చిత్రాలకు నిర్మాతగా మరి ప్రొడక్షన్ పనులు చూసుకునేది. ఈ జంటకు 2007లో వివాహం జరిగింది. శౌర్య అనే కుమారుడు కూడా ఉన్నాడు.
దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు. పునీత్ 2021లో గుండె పోటు కారణంగానే మరణించిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ రాఘవేంద్ర నటుడిగా రాణిస్తున్నారు. చిన్నారి ముఠా చిత్రంలో నటనకి గాను విజయ్ రాఘవేంద్ర జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. కానీ తన భార్యని కోల్పోవడంతో విజయ్ రాఘవేంద్ర తీవ్ర శోకంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. విజయ్ మల్టీ ట్యాలెంటెడ్ హీరో. సింగర్ గా కూడా ఎన్నో పాటలు పాడారు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. ఇక స్పందన మాజీ పోలీస్ అధికారి శివరామ్ కుమార్తె. ఆమెని ప్రేమించి విజయ్ వివాహం చేసుకున్నారు.