ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన కన్నుమూత.. వెకేషన్‌లో ఉండగా హఠాన్మరణం..!

కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు.

Kannada actor Vijay Raghavendra wife Spandana dies of cardiac arrest ksm

కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం స్పందన బ్యాకాంక్‌లో ఉన్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఆమె అక్కడికి వెళ్లారు. అయితే ఆదివారం రాత్రి స్పందనకు గుండెపోటు రావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. స్పందన ఆకస్మిక మరణ వార్త ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, శాండల్‌వుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

అయితే ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ రాఘవేంద్ర ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నట్టుగా సమాచారం. ఆయన ఆగస్ట్ 25న విడుదల కానున్న ‘కడ్డ’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక, బెంగుళూరుకు చెందిన స్పందన.. రిటైర్డ్ పోలీసు అధికారి బీకే శివరామ్ కుమార్తె.  విజయ్ రాఘవేంద్ర 2007లో స్పందనను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. ఇక, స్పందన 2016లో రవిచంద్రన్‌ ‘అపూర్వ’ చిత్రంలో నటించారు. రాఘవేంద్ర-స్పందన దంపతుల 16వ వివాహ వార్షికోత్సవానికి కేవలం 19 రోజుల ముందు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక,స్పందన మరణవార్త తెలిసిన వెంటనే.. కుటుంబ సభ్యులు ఇప్పటికే బ్యాంకాక్ బయలుదేరారు. స్పందన భౌతికకాయాన్ని మంగళవారం భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios