కన్నడ నటుడు సత్యజిత్‌(నిజాముద్దీన్‌)పై ఆయన కుమార్తె అక్తర్‌ స్వాలేహా ఫిర్యాదు చేసింది. తనని డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆమె బాణసవాడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కన్నడ నటుడు సత్యజిత్‌(నిజాముద్దీన్‌)పై ఆయన కుమార్తె అక్తర్‌ స్వాలేహా ఫిర్యాదు చేసింది. తనని డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆమె బాణసవాడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను నెలకు రూ. లక్ష చెల్లిస్తున్నప్పటికీ, ఇంకా ఎక్కువ డబ్బు కావాలని డిమాండ్‌ చేస్తున్నాడని, అంతేకాక సత్యజిత్‌ పెద్ద కుమారుడు నసీరుద్దీన్‌, అతని సహచరులు బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో తెలిపింది. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు పేర్కొంది. 

శుక్రవారం రాత్రి తన భర్త ఇబ్రహీం ఖాన్‌తో కలిసి సత్యజిత్‌ కుమార్తె అక్తర్‌ స్వాలేహా ఫిర్యాదు చేసింది. తన అన్నయ్య, ఆయన సహచరులు ఇంట్లో చొరబడ్డారని పేర్కొంది. అంతేకాదు రెండు వారాల క్రితం సివిల్‌ కోర్ట్ లో కూడా కేసు పెట్టారు. దీనిపై స్వాలేహా స్పందిస్తూ, తన తండ్రి డబ్బు కోసం వేధిస్తున్నాడని పేర్కొంది. తాను తొమ్మిది నెలల గర్భవతి అని, ఆరు నెలలుగా అతనికి నెలకు లక్ష రూపాయలు చెల్లించానని చెప్పింది. వివాహం అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు రూ.42లక్షలు చెల్లించానని తెలిపింది.

తాను ప్రసూతి సెలవులు తీసుకున్నానని, దీంతో తనకు ఆదాయం తగ్గిందని, దీంతో ఆయనకు పంపించడం ఆపేశానని పేర్కొంది. ఇదిలా ఉంటేదీనిపై సత్యజిత్‌ వర్గాలు స్పందిస్తూ, తన కూతుళ్ల కోసం ఇంటిని అమ్మి లోన్‌ తీసుకున్నానని, ఆ లోన్‌ అమౌంట్‌ కోసం అడుగుతున్నట్టు చెప్పింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్రేన్‌ వ్యాధి కారణంగా నటుడు సత్యజిత్‌ కాలు కోల్పోయిన విషయం తెలిసిందే.