కన్నడ హీరో కోమల్ మీద బెంగుళూరులో తీవ్రదాడి జరిగింది. ఆయన కారుని ఆపి మరీ ఓ దుండగుడు కారులో నుండి బయటకి లాగి పిడిగుద్దులు గుద్దాడు. ఈ ధాటికి హీరో కోమల్ ముక్కు నోటి వెంట రక్తం కారింది. అయినా ఆపకుండా కమల్ పై దాడికి దిగాడు.

ఈ సంఘటనను రోడ్డుపై వెళ్తున్న వారు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో కోమల్ తమ కూతురిని స్కూల్ నుండి తీసుకురావడానికి కారులో బెంగుళూరులోని శ్రీరాంపుర రైల్వే సమీపం నుండి వెళ్తున్నాడు.

ఈ క్రమంలో మార్గం మధ్యలో హీరో కోమల్ కారుని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి దురుసుగా కారుని తాకిస్తూ వెళ్లాడు. దీంతో కారులో ఉన్న హీరో కోమల్ బైకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బైకర్.. కోమల్ ముఖం, నోటి, ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో కోమల్ నోటి, ముక్కు వెంట రక్తం కారిపోయింది. 

రంగంలోకి దిగిన పోలీసులు బైకర్ ని అరెస్ట్ చేశాడు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని.. బహుసా గంజాయి తాగి ఉంటాడని..వెనుక ఓ అమ్మాయి కూడా ఉందని ప్రాధమిక విచారణలో తేలినట్లు బెంగుళూరు డీసీపీ వివరించారు. కాగా హీరో కోమలు సోదరుడు ప్రముఖ హీరో బీజేపీ నాయకుడు జగ్గేష్ దీనిపై సీరియస్ అయ్యాడు. తన సోదరుడు కమల్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశాడు.