ప్రకాష్ కోవెలమూడి మాజీ భార్య కనికా థిల్లాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. నిర్మాత మరియు రచయిత హిమాన్షు శర్మతో ఆమె నిశ్చితార్థం ముంబైలో సోమవారం జరిగింది. కేవలం బంధు మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా  ఈ వేడుక జరిగింది.  బాలీవుడ్ రచయిత కనికా థిల్లాన్ ని రాఘవేంద్రరరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు.  కొద్దికాలం కలిసున్న వీరిద్దరూ విడిపోయారు. కనికా, ప్రకాష్ విడాకులు తీసుకున్న విషయం గత ఏడాది బయటికి వచ్చింది. నిజానికి 2017లోనే కనికా... ప్రకాశ్ నుండి విడాకులు తీసుకున్నారట. 
 
సోమవారం హిమాన్షు శర్మతో కనికా నిశ్చితార్థం వేడుక పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని కనికా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన నిశ్చితార్థ  వేడుకకు సంబందించిన ఫోటోలు కనికా థిల్లాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. 
 
ఇక అనుష్క హీరోయిన్ గా 2015లో విడుదలైన సైజ్ జీరో చిత్రానికి కనికా, ప్రకాష్ కలిసి పని చేయడం జరిగింది. సైజ్ జీరో చిత్రానికి స్టోరీ కనికా అందించారు. దర్శకుడిగా ప్రకాష్ వ్యవహరించడం జరిగింది. అయితే ఆ మూవీ అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఆ సినిమా తరువాతే ప్రకాష్, కనికా మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. కాగా ప్రకాష్ ని అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్య వార్తలు రావడం విశేషం. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kanika Dhillon (@kanika.d)