`కంగువ` స్టోరీ, బడ్జెట్, క్రేజీ డిటెయిల్స్.. సూర్యకి `బాహుబలి`లాంటి సినిమా అవుతుందా?
శివ దర్శకత్వంలో ఈ మూవీ భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. కొంత రియలిస్టిక్, మరికొంత ఫిక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సూర్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన `కంగువ` గ్లింప్స్ ట్రెండ్ అవుతుంది.
కోలీవుడ్ సెన్సేషన్ సూర్య.. నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. తాను నటిస్తున్న సినిమా `కంగువ` ఫస్ట్ గ్లింమ్స్ విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు గూస్‌బాంమ్స్ తెప్పిస్తుంది. ఇందులో సూర్య పాత్ర అత్యంత భయంకరంగా ఉంది. `విక్రమ్`లోని రోలెక్స్ పాత్రకి నెక్ట్స్ లెవల్ కనిపిస్తుంది. కాకపోతే ఊరమాస్‌గా ఉంది. ఓ ఆదివాసి తెగల నాయకుడిగా ఆయన నటిస్తున్నట్టు తెలుస్తుంది. యుద్ధ వీరుడు పాత్రని పోషిస్తున్నారు సూర్య.
శివ దర్శకత్వంలో ఈ మూవీ భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. కొంత రియలిస్టిక్, మరికొంత ఫిక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సూర్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన `కంగువ` గ్లింప్స్ ట్రెండ్ అవుతుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అవి అంచనాలు మరింత పెంచుతున్నాయి.
ప్రధానంగా `కంగువ` అంటే ఏంటి? అనేది చూస్తే.. దర్శకుడు శివ చెప్పిన దాని ప్రకారం.. తమిళంలో కంగు అంటే అగ్ని అని అర్థం. `కంగువ` అంటే అగ్ని ధరించిన వ్యక్తి అని. ఈ సినిమాలో సూర్య ఎక్కువగా అగ్ని(మంటలతో) ధరించి యుద్ధాలు చేస్తుంటారు. ఇది పురాణాలకు సంబంధించిన కథ కాదని తెలిపారు. అయితే హిస్టరీలోని అంశాలను బేస్ గా చేసుకుని దానికి కల్పిత కథను జోడించి తెరకెక్కించారట దర్శకుడు శివ. సినిమా ప్రధానంగా 14వ సెంచరీ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఫారెస్ట్ నేపథ్యంలో సినిమా ఎక్కువగా రన్ అవుతుందట.
దట్టమైన అరణ్యంలోని ట్రైబల్స్ రాజ్యాల మధ్య యుద్ధాల నేపథ్యంలో సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. సూర్య యోధుడిగా కనిపిస్తాడని, తన జాతికి నాయకుడిగా ఆయన కనిపిస్తాడు. అత్యంత క్రూరంగా ఆయన పాత్ర తీరుతెన్నులుంటాయని తెలుస్తుంది. స్టూడియో గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ తెలుస్తుంది. ఇది రెండు భాగాలుగా రాబోతుందని తెలుస్తుంది. రెండు భాగాలుగా మేకర్స్ దీన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
దీంతోపాటు మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించబోతుందట. నెగటివ్ రోల్ కోసం బాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీతో చర్చలు జరుపుతున్నారట. ఆమె ఓకే చెబితే సినిమా రేంజ్ మారిపోతుందని, మరింత క్రేజీగా మారుతుంది. సినిమాకి హైప్ వస్తుందని అంటున్నారు. ఇందులో ఇప్పటికే బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె నటిస్తున్న తొలి తమిళ మూవీ ఇది కావడం విశేషం.
`కంగువ` సినిమాని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో 3డీ వెర్షన్‌లోనూ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు పది ఇండియన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. వీటితోపాటు అంతర్జాతీయంగానూ ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలనుకుంటున్నారు. దాదాపు ఆరు అంతర్జాతీయ భాషల్లోనూ రిలీజ్‌కి నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్లాన్ చేస్తున్నారు. ఓ రకంగా సూర్యకి ఇది `బాహుబలి` లాంటి సినిమా అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ రేంజ్ సినిమా కావాలని కోరుకుంటున్నారు.