Asianet News TeluguAsianet News Telugu

`కంగువ` గ్లింప్స్.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న సూర్య.. జస్ట్ విజువల్‌ ఫీస్ట్..

డైరెక్టర్‌ శివ, ఆయన టీమ్‌ కలిసి `కంగువ` సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గ్లింమ్స్ విడుదలైంది. సూర్య పుట్టిన రోజు(జులై 23) సందర్భంగా `కంగువ` గ్లింప్స్ ని విడుదల చేశారు. 

kanguva glimpse out suriya mind blowing it just visual feast arj
Author
First Published Jul 23, 2023, 12:01 AM IST

సూర్య.. బ్యాక్‌ టూ బ్యాక్ హిట్లతో మంచి ఊపులో ఉన్నారు. `జై భీమ్‌`, `విక్రమ్‌`తో తన విశ్వరూపం చూపించారు. `విక్రమ్‌`లో ఆయన కనిపించింది ఐదు నిమిషాలే అయినా పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాకి హై తీసుకొచ్చింది. ఐదు నిమిషాల సీన్‌తోనే సూర్య నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన భారీ పీరియాడికల్‌ మూవీ చేస్తున్నారు. `కంగువ` పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో ఆయన యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. 

డైరెక్టర్‌ శివ, ఆయన టీమ్‌ కలిసి `కంగువ` సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గ్లింమ్స్ విడుదలైంది. సూర్య పుట్టిన రోజు(జులై 23) సందర్భంగా `కంగువ` గ్లింప్స్ ని విడుదల చేశారు. అర్థరాత్రి 12గంటల 1 నిమిషానికి ఈ గ్లింప్స్ ని విడుదల చేయడం విశేషం. ఈ గ్లింమ్స్ ఆద్యంతం విజువల్‌ వండర్‌గా, గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉంది. అంతేకాదు సూర్యలోని మరో యాంగిల్‌ని చూపిస్తుంది. ఇక గ్లింమ్స్..ఓ దట్టమైన ఫారెస్ట్ లో ప్రత్యర్థులు అంతా యుద్ధంలో చనిపోయి ఉంటారు. నీళ్లలో తేలియాడుతూ ఉంటారు. ఒకడు మాత్రం తిరుగుబాటుకి ప్రయత్నిస్తుంటాడు. దీంతో నిప్పులు కక్కే విళ్లుని వదులుతాడు సూర్య. అది అతని లోపలికి దూసుకెళ్తుంది. దీంతో ప్రత్యర్థుల సైన్యం మొత్తం అంతమైపోతుంది. 

ఓ వైపు వెనకాల నిప్పులు కొలువలతో బాణాలు దూసుకొస్తుంటాయి. వాళ్ల నుంచి ఒక్కడు బయటకు వస్తాడు. అరుపులతో హోరెత్తిస్తుంటాడు. అతనే కంగువా(సూర్య). ఆదివాసి వీరుడిగా కనిపించాడు సూర్య. అయితే ఆయన రాక్షసత్వంగా నవ్వుతూ భయపెట్టిస్తున్న తీరు చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే. ఆ సీన్‌లో సూర్య నెక్ట్స్ లెవల్‌ చూపించాడు. ఆయన గెటప్‌ డీ సైతం షాకింగ్‌లా ఉంది. ఫారెస్ట్ ఏరియాలో ఆదివాసి తెగల నాయకుడిగా సూర్య(కంగువ) కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ గ్లింప్స్ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. 

ఇదొక విజువల్‌ వండర్‌లా ఉంది. బీజీఎం మోత హోరెత్తిస్తుంది. దీనికితోడు కంగువని పరిచయం చేసే ప్రారంభ సన్నివేశాలు, డైలాగులు సైతం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉండటం విశేషం.జస్ట్ ఫస్ట్ గ్లింప్సే ఈ రేంజ్‌లో ఉంటే, టీజర్‌, ట్రైలర్‌లు, ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. స్టూడియో గ్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్‌లో ఈ భారీ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. సగానికిపైగానే షూటింగ్‌ పూర్తయ్యిందని తెలుస్తుంది. దిశా పటానీ ఇందులో కథానాయికగా నటిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కనుంది. దాదాపు పది భాషల్లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios