బాలీవుడ్ లో ఇటీవల కంగనా కంటే ఎవరు పెద్దగా పాపులర్ అవ్వలేదనే చెప్పాలి. మంచి తనం ఎంత ఉందొ మొండితనం కూడా అదే రేంజ్ లో ఉందంటూ ప్రతి విషయంలో వేలుపెడుతూ రచ్చ చేయడం అమ్మడికి అలవాటే. ఇకపోతే రీసెంట్ గా ఈ బ్యూటీ లవ్ లో ఉన్నట్లు తెలిపి అందరికి షాక్ ఇచ్చింది. 

గతంలో ఆదిత్య పంచోలి - హృతిక్ రోషన్ వంటి వారితో ప్రేమాయణాన్ని కొనసాగించి వారికి షాక్ ఇచ్చిన ఈ కాంట్రవర్సీ బ్యూటీ ఇప్పుడు మరొకరి ప్రేమలో ఉన్నట్లు చెప్పడంతో.. ఎవరా బాధితుడు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మడి మాజీ ప్రేమికులు ఇప్పుడు మీడియా ముందుకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. 

అంతగా వారి గాలి తీసేసిన కంగనా ఇప్పుడు మరో మగాడితో నిజమైన ప్రేమ గాలి అనుభూతి పొందినట్లు చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డేటింగ్ వంటి విషయాలకు దూరంగా ఉంటానని చెబుతూ అసలైన ప్రేమను ఇప్పుడే పొందినట్లు కంగనా వివరణ ఇచ్చింది.