ప్రముఖ దర్శకుడు క్రిష్‌ కొంతమేరకు  దర్శకత్వం   వహించిన 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' వివాదం కొనసాగుతోంది. సినీ నటి కంగనా రనౌత్‌తో విభేదాలు ఏర్పడిన విభేధాలు ఇప్పుడిప్పుడే తొలిగేటట్లులేవు. ఓ దర్శకుడిగా తనకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదని క్రిష్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ బాధపడ్డారు.

మరో ప్రక్క ఈ వివాదంపై కంగన రనౌత్‌ సోదరి రంగోలి స్పందిస్తూ ...క్రిష్‌ సినిమా మొత్తాన్ని తానే తెరకెక్కించినట్లైతే అది నిజమని నిరూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఓ జాతీయ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ క్రిష్‌, న‌టుడు సోనూసూద్‌పై కంగ‌న విమ‌ర్శ‌లు చేసింది.

కంగనా మాట్లాడుతూ...`విడుద‌ల‌కు ముందే డిసెంబ‌ర్‌లో క్రిష్‌కు సినిమా చూపించాల‌నుకున్నాం. కానీ, అప్ప‌టికే ఆయ‌న సినిమాపై న‌మ్మ‌కాన్ని కోల్పోయారు. మేం సినిమాను నాశ‌నం చేశామ‌నే భావ‌న‌లో ఉన్నారు. అయితే విడుద‌ల త‌ర్వాత ఆయ‌న‌కు సినిమా న‌చ్చింది. అప్ప‌ట్నుంచి ఆయ‌న `ఇది నా సినిమా` అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

మీడియా ముందుకు వ‌చ్చి గొడ‌వ చేయ‌డం ఎందుకు? న‌న్ను నేరుగా వ‌చ్చి క‌ల‌వొచ్చుగా. ఆయ‌న ఒక్క‌సారి కూడా న‌న్ను క‌ల‌వ‌లేదు. ఇక‌, సోనూసూద్‌కు ఈ సినిమా గురించి మాట్లాడే హ‌క్కు లేదు. ఈ సినిమాతో ఆయ‌న‌కు ఎటువంటి సంబంధ‌మూ లేదు. వీళ్లంతా నా సినిమాను నాశ‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌`ని కంగ‌న  చెప్పుకొచ్చారు. 

అవాహే ‘‘మణికర్ణిక’కు నేనే దర్శకత్వం వహించా. ఆ విషయంలో ఎటువంటి మార్పులేదు. క్రిష్‌ ఇలా నన్ను ఎటాక్‌ చేయడం సరికాదు. ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే నిరూపించుకోమని చెప్పండి. మీడియాతో మాట్లాడితే ఆయనకు ఎటువంటి లాభం లేదు. ‘మణికర్ణిక’ విడుదలైంది. ఆ సినిమాకు నేనే దర్శకత్వం వహించా. ఈ విషయంలో ఇక చేయడానికి ఏం లేదు’.