Asianet News TeluguAsianet News Telugu

నా బయోపిక్ కి నేనే డైరెక్టర్: కంగనా!

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తన బయోపిక్ కి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని మీడియాద్వారా వెల్లడించింది. తన జీవితం ఎలా ఉండేదో.. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా తెరకెక్కిస్తానని చెప్పింది.

kangana ranaut to direct her own biopic
Author
Hyderabad, First Published Feb 14, 2019, 3:41 PM IST

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తన బయోపిక్ కి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని మీడియాద్వారా వెల్లడించింది. తన జీవితం ఎలా ఉండేదో.. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా తెరకెక్కిస్తానని చెప్పింది.

''నన్ను జడ్జ్ చేయకుండా నన్ను నాలా స్వీకరించి ప్రేమించేవారు నా చుట్టూ ఎందఱో ఉన్నారు. వారి కోసమైనా సినిమా తీయాలని అనుకుంటున్నానని'' కంగనా స్పష్టం చేసింది. కొన్ని వారల క్రితం ప్రముఖ రచయిత విజేయంద్రప్రసాద్ కంగనా జీవితంపై పుస్తకం రాస్తానని చెప్పారట.

ఆయన పుస్తకాన్ని ఎంతో నిజాయితీతో రాస్తారనే నమ్మకం ఉందని కంగనా తెలిపింది. ఆ కారణంగానే ఒప్పుకున్నట్లు.. తన బయోపిక్ కి విజయేంద్రప్రసాదే కథ అందిస్తారని చెప్పుకొచ్చింది. తన జీవితంలో సహాయం చేసిన వారి దగ్గరనుండి అవమానించిన వారి వరకు అందరి గురించి బయోపిక్ లో ప్రస్తావించబోతున్నట్లు వెల్లడించింది.

అయితే ఎవరి పేరుని బయటపెట్టనని వారి నుండి తనను తాను కాపాడుకోవాలని స్పష్టం చేసింది. ఓ చిన్న ప్రాంతానికి చెందిన అమ్మాయి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగిందనే విషయంపై బయోపిక్ ఉండబోతున్నట్లు చెప్పుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios