కంగనా రనౌత్ బాలీవుడ సంచలనం.. కాంట్రవర్సి క్వీన్.. ఆమె ఎప్పుడు ఎవరి గురించి ఎలా స్పందిస్తుందో ఎవరికీ తెలియదు. బాలీవుడ్ ను పాపాల పుట్టా అంటూ కామెంట్ చేసే కంగనా ఈసారి హాలీవుడ్ లో అది కూడా ఆస్కార్ గురించి స్పందించింది. 

కంగనా రనౌత్ బాలీవుడ సంచలనం.. కాంట్రవర్సి క్వీన్.. ఆమె ఎప్పుడు ఎవరి గురించి ఎలా స్పందిస్తుందో ఎవరికీ తెలియదు. బాలీవుడ్ ను పాపాల పుట్టా అంటూ కామెంట్ చేసే కంగనా ఈసారి హాలీవుడ్ లో అది కూడా ఆస్కార్ గురించి స్పందించింది. 

ఆస్కార్ అవార్డుల వేడుకలోఅందరూ షాక్ అయ్యే విధంగా జరిగిన సంఘటనపై బాలీవుడ్ కాంట్రవర్సియల్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. కింగ్ రిచర్డ్ సినిమాకి విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ స‌మ‌యంలో యాంకర్ క్రిస్ రాక్ మాట్లాడిన తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విల్ స్మిత్ అతని చెంప పగలగొట్టాడు. ఈ సంఘటన హాలీవుడ్ అంతటిని విస్మయానికి గురి చేసింది. 

ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందించింది. విల్ స్మిత్ భార్యపై జోక్ వేసిన‌ యాంక‌ర్ క్రిస్ రాక్‌పై మండిప‌డింది. విల్‌స్మిత్‌కి కంగనా మ‌ద్ద‌తు తెలిపింది. జోక్ వేయ‌డానికి ఎవడైనా ఇడియట్ త‌న‌ అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడితే తాను కూడా విల్ స్మిత్‌లాగే చేస్తాన‌ని చెప్పింది. తాను కూడా గట్టిగా బదులిస్తాన‌ని పేర్కొంది. 

ఆ యాంక‌ర్ త్వ‌ర‌లోనే త‌న లాకప్ షోకి కంటెస్టెంట్‌గా వస్తాడని ఆశిస్తున్నాన‌ని చెప్పింది. న‌వ్వుతోన్న ఎమోజీని ఆమె ఈ సంద‌ర్భంగా జోడించింది.ఆస్కార్ వేడుకలు ఈసారి రెండు మూడు వివాదాలతో ముగిసాయి. ఆస్కార్ లో మన ఇండియన్ లెజండ్స్ లతా మంగేష్కర్ , దిలీప్ కుమార్ లకు నివాళి అర్పించకపోవడంతో కూడా ఇండియన్ ఆడియన్స్.. ఆస్కార్ కమిటీపై మండి పడుతున్నారు.