హీరోయిన్‌ యామీ గౌతమ్‌ ఇటీవల `ఉరి` డైరెక్టర్‌ ఆదిత్యని పెళ్లి చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి మ్యారేజ్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది బాలీవుడ్‌ ప్రముఖులు యామీ గౌతమ్‌కి విషెస్‌ తెలియజేస్తున్నారు. పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. అయితే దీనిపై కంగనా రనౌత్‌ స్పందించింది. పలువురికి ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. 

నటుడు ఆయుష్మాన్‌ ఖురానా స్పందిస్తూ, ఆమెకి విషెస్‌ తెలియజేస్తూ యామీ ఎంతో సింపుల్‌గా రెడీ అయిందని కామెంట్‌ చేశాడు. దీనికి కంగనా స్పందించింది. ఓ విషయాన్ని సింపుల్‌ అని నిర్ధారించడం ఎంత కష్టమో తెలుసా? అలా రెడీ కావడం కూడా చాలా కష్టమని, మన భారతీయ సంప్రదాయంలో భాగమని చెబుతూ ఘాటుగా రిప్లై ఇచ్చింది కంగనా. మరోవైపు విక్రాంత్‌ మస్సే కి కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. `యామీ చూస్తుంటే అచ్చం రాదేమాలా ఉందని తెలిపాడు. దీనికి కంగనా రియాక్ట్ అవుతూ, `ఈ బొద్దింక ఎక్కడ నుంచి వచ్చింది. నా చెప్పులు తీసుకురండి..` అని పోస్ట్ పెట్టింది. 

దీంతో ఇప్పుడీ పోస్టులు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. కొందరు కంగనాకి సపోర్ట్ గా పోస్టులు పెడుతుంటే, మరికొందరు పెళ్లి చేసుకుంది ఒకరు, విషెస్‌ చెప్పింది మరొకరు మధ్యలో కంగనాకి ఏంటీ అవసరం అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు కంగనా రనౌత్‌ ట్రెండ్‌ అవుతుంది. ఇదిలా ఉంటే కంగనా అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ని కొన్ని రోజుల క్రితం ట్విట్టర్‌ నిర్వహకులు రద్దు చేసిన విషయం తెలిసిందే.