బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీలపై తరచుగా కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటుంది. సోలో హీరోయిన్ గా కంగనా రనౌత్ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీలపై తరచుగా కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటుంది. సోలో హీరోయిన్ గా కంగనా రనౌత్ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఇటీవల కంగనా రనౌత్ రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీలో కంగనా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని మాండీ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించింది.
ఎంపీగా గెలిచిన తర్వాత కంగనా రనౌత్ కి చేదు అనుభవం ఎదురైంది. గురువారం రోజు కంగనా చండీఘర్ విమానాశ్రయంలో ఉండగా అక్కడ ఆమెని ఓ మహిళా సిఐఎస్ఎఫ్ అధికారి చెంప దెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. కంగనా రనౌత్ రైతుల ఉద్యమం గురించి కామెంట్స్ చేసిందట. ఆ కామెంట్స్ కి సిఐఎస్ఎఫ్ అధికారి కోపం కట్టలు తెంచుకుంది.
ఆ అధికారి పేరు కుల్విందర్ కౌర్ అని తెలుస్తోంది. ఎంపీగా ఎన్నికైన కంగనా పట్ల ఆమె దురుసుగా ప్రవర్తించడంతో ఉన్నత అధికారులు ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై కంగనా స్పందించాల్సి ఉంది. కంగనా ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ ని సందర్శించడం, బిజెపి అగ్రనాయకులుని కలవడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొంది.
