కంగనా రనౌత్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఖతార్ ఎయిర్‌వేస్ సీఈఓని పట్టుకుని ఆమె ఇడియట్ అని తిట్టేసింది. ఈ మేరకు కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) మరో వివాదంలో ఇరుక్కుంది. ఖతార్(Qatar) ఎయిర్‌వేస్ సీఈఓని పట్టుకుని ఆమె ఇడియట్ అని తిట్టేసింది. ఈ మేరకు కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. అయితే వాసుదేవ్ అనే నెటిజన్ ఖతార్ ఎయిర్ వేస్ సీఈఓ అక్బర్ అల్ బేకర్ ఇంటర్వ్యూని పేరడీ చేస్తూ ఓ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ కంగనా వివాదాస్పద కామెంట్లు చేసింది. ఖతార్ ఎయిర్‌వేస్ సీఈఓ అక్బర్ అల్ బేకర్‌ని `ఇడియట్ ఆఫ్ ఏ మ్యాన్` అంటూ పోస్ట్ చేసింది.
ఇటీవల ఇద్దరు బీజేపీ నాయకులు మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అవి దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. భారీ దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఖతార్ ఎయిర్‌వేస్‌ని ఇక్కడ బహిష్కరించాలని చెబుతూ, ట్విట్టర్ నెటిజన్ పంచుకున్న పేరడీ వీడియో ఆధారంగా కంగనా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆ పేరడీ వీడియోలో `హిందూ దేవతల నగ్న చిత్రాలను చిత్రీంచిన చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్‌కి ఖతార్ ఆశ్రయం ఇచ్చిందని, వారిని మన వద్ద బహిష్కరించాలని తెలిపారు. అయితే బీజేపీ ప్రతినిధి నుపురు శర్మ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఇండియన్స్ ని బహిష్కరించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని వదిలేసి నెటిజన్ మాత్రం ఖతార్ ఎయిర్‌వేస్‌ని, అక్కడి ఉత్పత్తులను బహిష్కరించాలని కామెంట్ చేశారు. అయితే ఈ నెటిజన్ పేరడీ వీడియో ఆధారంగా చేసుకుని కంగనా `ఈ రౌడీని ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై కోపంగా స్పందించడం దుమారం రేపుతున్నాయి.
ఇంకా ఆమె చెబుతూ, ఒక పేదవాడిని ఎగతాళి చేసినందుకు ఈ రౌడీని ప్రోత్సహిస్తున్న భారతీయులు అని పిలవబడే వారందరు ఈ అధిక జనాభా కలిగిన దేశంలో పెద్ద భారంగా ఉన్నారు` అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది కంగనా. `నీలాంటి ధనవంతుడికి వాసుదేవ్(నెటిజన్) పేదవాడు, చిన్నవాడు కావచ్చు, కానీ తన బాధని, నిరుత్సాహాన్ని ఏ సందర్భంలోనైనా వ్యక్తికరించే హక్కు అతనికి ఉంది. ఈ ప్రపంచానికి మించిన ప్రపంచం ఉందని గుర్తుంచుకోండి` అని ఆమె తెలిపింది.
అయితే కంగనా పోస్ట్ వైరల్ అయిన నేపథ్యంలో పలు నెగటివ్ కామెంట్లు వినిపించాయి. దీంతో కంగనా వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ ఇన్‌స్టాగ్రామ్ క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాదాన్ని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నాయకులు చేసిన కామెంట్లకి ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, మలేషియా, యూఏఈ, జోర్దాన్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్థాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా, లర్కీ, ఇండోనేషియా వంటి పదహారు దేశాలు ఇండియాకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి చేసిన కామెంట్లు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవు అని వివరణ ఇచ్చారు.
