కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇండస్ట్రీ అంతా ఇంటికే పరిమితమైంది. టాప్‌ స్టార్లు కూడా సినిమాలు లేకపోవటంతో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే లాక్‌ డౌన్‌ కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో అంతా ఇంటికే పరిమితమవుతున్నారు. కానీ ఈ పరిస్థితుల్లోనూ ఓ హీరోయిన్‌ సాహసం చేసింది. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని పిక్‌నిక్‌కి వెళ్లింది వివాదాస్పద నటి కంగనా రనౌత్‌.

లాక్‌ డౌన్‌ సమయమంతా ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు కేటాయిస్తోంది కంగనా. అదే సమయంలో సినిమాల కథలు వింటూ తాను డైరెక్ట్‌ చేయబోయే సినిమాలకు కూడా తుది మెరుగులు దిద్దుతోంది. ఈ గ్యాప్‌లోనే తన ఫ్యామిలీని తీసుకొని పిక్‌నిక్‌కి వెళ్లింది. ఈ విషయాన్ని కంగన సోదరి రంగోలి చందల్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

`మా తల్లి దండ్రుల కోరిక మేరకు కంగనా ఫ్యామిలీ పిక్‌నిక్‌ ప్లాన్ చేసింది. వర్షాకాలం మొదలు కాకముందే మా పేరెంట్స్ సమ్మర్‌ అవుట్‌డోర్స్‌ను ఎంజాయ్ చేయాలనుకున్నారు. మేం గ్రీన్ జోన్‌లో ఉన్నప్పటికీ పిక్‌నిక్‌కు వెళ్లేందుకు పర్మీషన్‌ తీసుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మాకు అన్ని పర్మిషన్స్ ఇచ్చిన అధికారులకు కృతజ్ఞతలు. ఇది తప్పని సరి ఫ్యామిలీ అవుటింగ్‌` అంటూ పోస్ట్ చేసింది.