'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ .. రాఘవ లారెన్స్ రచ్చ.. నెటిజన్ల క్రేజీ కామెంట్లు..
చంద్రముఖి 2 తలుపులు గణేశ్ చతుర్థికి తెరుచుకోనున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న రజనీని ఈ సినిమా ఒ్డడున పడేసింది. ఈ సినిమాకు ఎంత క్రేజ్ అంటే.. ఇప్పటికీ టీవీల్లో వస్తే మంచి రేటింగ్ తెచ్చుకుంటుంది. 2005లో విడుదలైన ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్ చేశాడు. దీనికి సీక్వెల్ చేయాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్ ఒప్పుకోకపోవడంతో సీక్వెల్ కథతో తెలుగులో నాగవల్లి సినిమా చేశాడు.
ఇన్నాళ్లకు దాదాపు 18 ఏళ్ల తర్వాత తమిళంలోనూ చంద్రముఖి 2 పూర్తి చేశాడు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్ నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసింది. వడివేలు, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అయితే ఫస్ట్ లుక్ చూసిన వాళ్లు కంగారు పడుతున్నారు. సీక్వెల్ కు ఫస్ట్ లుక్ లా లేదని ఏదో చంద్రముఖి కు స్పూఫ్ తీస్తున్నట్లు ఉందని అంటున్నారు. రజనీలా లారెన్స్ నడిచి రావటాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు.
చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అధికారికంగా వెల్లడించారు. . సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. చంద్రముఖి 2 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 15న విడుదల కానుంది.