కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ యాక్టింగ్ లో మచ్చ లేకుండా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు వస్తోన్న క్రేజ్ కి అమ్మడు గాల్లో తేలిపోతోంది. సంబంధం లేకుండా సొంత డబ్బా కొట్టుకోవడం ఒక ఎత్తైతే అమ్మడు రాజకీయాల నాయకులను మించి తనకు తానే గొప్పలు చెప్పుకుంటోంది. 

ఆమె గొప్పలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకునే పొలిటీషియన్ కి పోటీ ఇచ్చేలా  ఉన్నాయని సెటైర్స్ వేస్తుండడం గమనార్హం.  రీసెంట్ గా మణికర్ణిక సినిమాతో కొంచెం బాక్స్ ఆఫీస్ వద్ద హడావుడి చేసిన కంగనా నెక్స్ట్ జయలలిత బయోపిక్ చేయడానికి సిద్ధమవుతోంది.

రీసెంట్ గా బేబీ ఈ బయోపిక్ గురించి మాట్లాడుతూ.. ఈ కథ ఒప్పుకోగానే నా కథ నాకు గుర్తొచ్చింది. దాదాపు సమానంగా ఉంది. నేనైతేనే కరెక్ట్. నా బయోపిక్ జయలలిత బయోపిక్ రెండు ఒకేసారి లైన్ లోకి వచ్చినప్పటికీ ముందుగా జయలలిత బయోపిక్ చేయడమే బెటర్ అంటూ చెప్పింది. దీంతో జనాలు మేడమ్ గారు మరి జయలలితతో పోల్చుకోవడం చూస్తుంటే డబ్బా కొట్టుకునే పొలిటీషియన్స్ కి పోటీ ఇస్తున్నట్లు ఉందని కామెంట్స్ వస్తున్నాయి. 

ఆ సంగతి అటుంచితే.. జయలలిత ఎన్ని విజయాలు సాధించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె సినీ లైఫ్ తరువాత పొలిటికల్ లైఫ్ అనేది ఎవరు ఊహించనిది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ అధికార పీఠాన్ని అందుకున్న జయలలిత ఎప్పుడు కూడా తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. 

కానీ కంగనా నలుగురి హీరోలపై కామెంట్ చేసి రెండు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకొనేసరికి డబ్బా కొట్టుకోవడంలో డోస్ పెంచేసింది.సినీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదని అమ్మడికి తెలిసే ఉంటుంది.. దానిపై ఒకసారి ఆలోచిస్తే బెటరేమో..?