ట్విట్టర్‌పై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఫైర్‌ అయ్యింది. తన ట్విట్టర్‌ ఖాతాని శాశ్వతంగా రద్దు చేయడంపై ఆమె మండిపడింది. తన ఖాతాని తొలగించడం వల్ల ట్విట్టర్‌ పుట్టుకతోనే అమెరికా అని రుజువు చేసుకుందని విమర్శించింది.

ట్విట్టర్‌పై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఫైర్‌ అయ్యింది. తన ట్విట్టర్‌ ఖాతాని శాశ్వతంగా రద్దు చేయడంపై ఆమె మండిపడింది. తన ఖాతాని తొలగించడం వల్ల ట్విట్టర్‌ పుట్టుకతోనే అమెరికా అని రుజువు చేసుకుందని విమర్శించింది. నల్లజాతి వారిని శ్వేతజాతి ఎప్పుడూ బానిసలుగానే భావిస్తుందని, మనం ఏం ఆలోచించాలి, మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే నిర్ణయించాలనుకుంటారని మండిపడింది కంగనా. ఇకపై ఇతర వేదికలు, సినిమాల ద్వారా నా గొంతు వినిపిస్తానని తెలిపింది కంగనా. 

ఇదిలా ఉంటే బెంగాల్‌లో అల్లర్లపై కంగనా ట్విట్టర్‌ ద్వారా పలు కామెంట్లు చేశారు. బీజేపీపై టీఎంసీ దాడులకు దిగుతుందని ఆమె పోస్టులు పెట్టింది. దీంతో తన నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా కంగనా ట్విట్టర్‌ అకౌంట్‌ని యాజమాన్యం శాశ్వతంగా తొలగిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో మండిపోయిన కంగనా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అసహనాన్ని వెల్లడించింది. ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

View post on Instagram

కంగనా రనౌత్‌ గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హత్య వ్య‌వ‌హారంపై కూడా ఘాటుగానే స్పందించారు. బాలీవుడ్‌లో నెపోటిజం, అలాగే డ్రగ్స్ వ్యవహారం, మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసి హట్‌ టాపిక్‌గా నిలిచారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె ఆఫీస్‌ని కూల్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయినా అధైర్య పడకుండా తన వాదనలను వినిపిస్తూనే, అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు. ఇలా రెగ్యూలర్‌గా సోషల్‌ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తుంది కంగనా.