Asianet News TeluguAsianet News Telugu

భారతీయ సినిమా ఆ నలుగురి సొత్తు కాదు.. కంగనా ఫైర్‌.. `జల్లికట్టు`కి అభినందనలు

 మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడింది కంగనా. ఇండియన్‌ సినిమా ఆ నలుగురి సొత్తు కాదని వ్యాఖ్యానించింది. ఇటీవల మలయాళ సినిమా సినిమా `జల్లికట్టు` భారత్‌ తరఫున `ఆస్కార్‌` నామినేషన్‌కి ఎంపికైన విషయం తెలిసిందే.

kangana ranaut fire on bollywood and says wishes to jallikattu movie arj
Author
Hyderabad, First Published Nov 26, 2020, 4:30 PM IST

సమయం చిక్కినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా బాలీవుడ్‌పై మండిపడుతుంది కంగనా రనౌత్. అందుకే బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడింది కంగనా. ఇండియన్‌ సినిమా ఆ నలుగురి సొత్తు కాదని వ్యాఖ్యానించింది. ఇటీవల మలయాళ సినిమా సినిమా `జల్లికట్టు` భారత్‌ తరఫున `ఆస్కార్‌` నామినేషన్‌కి ఎంపికైన విషయం తెలిసిందే. 93వ అకాడమీ పురస్కారాల పోటీకి ఈ సినిమాని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా `జల్లికట్టు` చిత్ర బృందానికి కంగనా అభినందనలు తెలిపింది. 

కంగనా ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, `అందరిపై అధికారం చలాయించాలని చూసే బుల్లీడావుద్‌ గ్యాంగ్‌కి సరైన శాస్తి జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది కాదుని నిరూపితమైంది. సినిమా మాఫియా గ్యాంగ్‌ ఇళ్లలోనే దాక్కొండి, జ్యూరీ తన విధిని పక్కాగా నిర్వర్తిస్తోంది. `జల్లికట్టు` టీమ్‌కి నా అభినందనలు` అని పేర్కొంది కంగనా. పరోక్షంగా బాలీవుడ్‌ టాప్‌ హీరోలను విమర్శించింది.

ఇటీవల సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య సమయంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై, అలాగే డ్రగ్స్ మాఫియాపై కంగనా ఫైర్‌ అయ్యింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏకంగా ఆమె చిన్నపాటి యుద్దమే చేసింది. ఇక కంగనా ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ `తలైవి`లో, అలాగే `దాఖడ్‌` చిత్రాల్లో నటిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios