ఇంత వరకూ ఎవరికీ దొరకని అరుదైన అవకాశం లభించింది. బాలీవడ్ లోనే కాదు.. పొలిటికల్ గా చూసినా.. ఇంత వరకూ ఏ మహిళకు ఈ అవకాశం రాలేదు. ఇంతకీ ఆమెకు దక్కిన అరుదైన అవకాశం ఏంటి..? 


ఇంత వరకూ ఎవరికీ దొరకని అరుదైన అవకాశం లభించింది. బాలీవడ్ లోనే కాదు.. పొలిటికల్ గా చూసినా.. ఇంత వరకూ ఏ మహిళకు ఈ అవకాశం రాలేదు. ఇంతకీ ఆమెకు దక్కిన అరుదైన అవకాశం ఏంటి..? 

 బాలీవుడ్‌ స్టార్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) అరుదైన గౌరవం దక్కించుకున్నారు. దసరా సందర్భంగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని రాంలీలా మైదానం లో నిర్వహించిన రావణ్‌ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రావణ దహనం చేశారు. 50 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఓ మహిళ ఈ కార్యక్రమానికి వెళ్లి రావణ దహనం చేయడం ఇదే తొలిసారి. దీంతో రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగన రికార్డుకెక్కారు.కాగా, 

రావణ్‌ దహన్‌ కార్యక్రమంలో కంగన సాంప్రదాయ చీరకట్టులో కనిపించారు. ఆమె వస్త్రధారణకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఎర్రటి చీర ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. జై శ్రీరామ్‌ అంటూ రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతిమలను దహనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా తదితరులు హారయ్యారు.

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. బాలీవుడ్ అంతా ఒక వైపు ఉంటే .. కంగనా మాత్రం ఒక వైపు ఉంటుంది. బీ టౌన్ లో జరిగే అన్యాయాలను ఫిల్టర్ లేకుండా బయటపెట్టి.. ఎంతటివారైనా నిలబెట్టికడిగేస్తుంది. అంతే కాదు ప్రతీ విషయంలో స్పందిస్తూ.. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఫైర్ బ్రాండ్ఇమేజ్ ను సాధించింది కంగనా. దాంతో ఆమె బాలీవుడ్ లో చాలా స్పెషల్ అనిపించుకుంది. ముఖ్యంగా నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ లపై ఆమె ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది.