బాలీవుడ్ వివాదాల సుందరి కంగనా రనౌత్ ఏం మాట్లాడినా సెన్సేషన్ అవ్వడం కామన్ గా మారింది. ఒక సినిమా చేస్తే రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటే ఎక్కువగా వివాదాలను క్రియేట్ చేస్తూ దేశమంతటా వైరల్ అయ్యేలా చేస్తోంది. ఇకపోతే రీసెంట్ గా బేబీ వంశపారంపర్య నటనకు ఎంతవరకు మద్దతు ఇస్తారు అనే విషయంపై తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. 

ఒక తల్లిగా నా బిడ్డలను వారికి ఇష్టమైన దారిలోనే ప్రోత్సహిస్తాను. ఇక వారు వరల్డ్ లోనే స్పెషల్ గా అసాధారణ పర్సన్ గా ఉండాలని అనుకుంటే మాత్రం మొదట ఒక సముద్రంలో తోసేస్తా.. అప్పుడు అతను ఎదురీది ఒడ్డుకు చేరతాడా లేదా అనే విషయాన్నీ తెలుసుకుంటా.. అలా ఎదురీదగలిగేలా పిల్లల్ని ప్రోత్సహించాలని కంగనా వివరణ ఇచ్చారు. 

అదే విధంగా బంధుప్రీతిపై కంగనాకు ఎలాంటి ఆలోచనతో ఉందొ ఒక్క సమాధానంతో అందరికి క్లారిటీ వచ్చేలా చెప్పింది. తన తమ్ముడు ఫైలెట్ అవ్వాలని కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతూ.. అతని కోసం ఎవరిని ప్రత్యేకంగా కలవలేదని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.