వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రామ్‌గోపాల్‌ వర్మ మరో వివాదాస్పద టైటిల్‌ను తెరపైకి తెచ్చారు. విజయవాడ, అమరావతి కేంద్రంగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే పేరుతో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో చెప్పారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ సినిమా అనౌన్స్ చేయడంతో అందరూ పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు.  అయితే వర్మ  సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో వివాదానికి తావే ఉండదని ట్వీట్ చేసిన వర్మ పెద్ద కాంట్రవర్శీని క్రియేట్ చేస్తున్నాడని పాట చూసిన తరువాత క్లిస్టర్ క్లియర్ గా అర్ధమవుతుంది. 'కత్తేల్లేవు ఇప్పుడు.. చిందే నెత్తురు లేదిప్పుడు.. యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారిందిప్పుడు..' ''కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం..'' అంటూ సాగే ఈ పాటలో విజువల్స్ మొత్తం ప్రస్తుత ఏపీ రాజకీయాలను చూపించారు.

సీబీఐ, టీవీ యాంకర్లను కూడా వర్మ ఈ పాటతో ఏకిపారేశాడు. సిరాశ్రీ రచించిన ఈ పాటను రవిశంకర్ పాడారు.