Asianet News TeluguAsianet News Telugu

కమ్మ కులంపై సెటైర్స్ సోషల్ మీడియాలో రచ్చః.. రచ్చస్య.. రచ్చోభ్యః..

  • డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కు బ్రాహ్మణ క్యాటరింగ్
  • ఇంగువ లేకుండా వంట చేయాలని కోరే కమ్మ వారింటి లేడీ
  • దాంతో కమ్మ వారిండ్లలో ఆడాళ్లు ఏది చెప్తే అది కాబట్టి ఒప్పించాలంటూ డీజే డైలాగ్
  • కమ్మ కులాన్నే కాక ఓ పాటలో ఎన్టీఆర్,ఏఎన్నార్ లను అవమానించారంటూ విమర్శలు
kamma caste people objections on dj duvvada jagannadham dialogues

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం డీజే రిలీజ్ కు ముందే.. బ్రాహ్మణ సంఘాలు ఓ పాటలోని పదాలపై అభ్యంతరం చెప్పడంతో వాటిని తొలగించాల్సి రావటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే.. రిలీజ్ తర్వాత కూడా దువ్వాడ జగన్నాథాన్ని వివాదాలు చుట్టుముట్టడం ఆగడం లేదు. ఈ సినిమాలో కమ్మ కులంపై డైరెక్ట్‌ గా డైలాగ్స్ చెప్పించడంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. నేరుగా అలా తమ వర్గంపై సెటైరిక్ గా మాట్లాడటంపై ఆ సామాజిక వర్గానికి చెందిన వారు, కొందరు దర్శక నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక.. ఓ పాటలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌లను అవమానించే రీతిలో చిత్రీకరించారనే వాదన కూడా వెలుగులోకి వచ్చింది.

 

దువ్వాడ జగన్నాథం చిత్రంలో పెళ్లికి సంబంధించిన ఓ సీన్ ఉంటుంది. ఆ పెళ్లికి సంబంధించిన వంటలను బ్రహ్మణులు (అల్లు అర్జున్) నడిపే అన్నపూర్ణ క్యాటరింగ్‌కు ఇస్తారు. అయితే పులిహోరలో ఇంగువ వద్దని పెళ్లి వారు గోల చేస్తున్నారని చెప్పగా.. ఇంగువ లేకపోతే పులిహోర టేస్టే ఉండదు అని అల్లు అర్జున్ అంటాడు. పెళ్లి వాళ్లను ఒప్పించడానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ కాల్ రిసీవ్ చేసిన పెళ్లి వారి తరపున ఆవిడ(ఝాన్సీ) మాట్లాడుతుంది.  మా ఇంట్లో పెళ్లి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మాది కమ్మ కులం, వాళ్లది వేరే కులం. మాకు ఇంగువతో కూడిన భోజనం ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడు బ్రహ్మణ పిల్లను చేసుకొంటున్నారు. బ్రహ్మణుల చేత వంట చేయిస్తున్నారు. బ్రాహ్మణ వంట తినకపోతే బాగుండదు అని నచ్చచెప్తారు. అలా ఆ సంభాషణలో భాగంగా బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు అని అల్లు అర్జున్ సెటైర్ వేస్తాడు. కమ్మవారి ఇంట్లో ఆడవాళ్లదే డామినేషన్.. మీరు చెప్తే అందరూ వింటారు అనే విధంగా స్టైలిష్ స్టార్ డైలాగ్ ఉంటుంది. దాంతో ఝాన్సీ సరే అంటుంది.

 

అయితే కమ్మ కులం అనే పదాన్ని డైరెక్ట్‌ గా వాడటంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కమ్మ కులంలో ఆడవాళ్ల డామినేషన్ నడుస్తుంది అని లేవనెత్తిన పాయింట్ కొందరికి మింగుడుపడటం లేదు. తమను అలా కించపరచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ కుల వివాదం ఒకటైతే... దువ్వాడ జగన్నాథం చిత్రానికి హైలెట్ గా నిలిచిన సిటీ మార్ పాటలో... అల్లు అర్జున్, పూజా హెగ్డే దుమ్ము రేపారు. పాటకు ఈలలతో థియేటర్ దద్దరిల్లింది. ఆ పాటలో భాగంగా ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, మెగాస్టార్ అంటూ ముగ్గురు హీరోలను ఆకాశానికి ఎత్తాడు దర్శకుడు. కానీ పాటలో మహానటులను చూపిన విధానంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీటీ మార్ పాటలో ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ అని అల్లు అర్జున్ అంటుండగా.. బ్యాక్ గ్రౌండ్‌లో ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు ప్రత్యక్షమవుతాయి. అయితే వీటిపై ఇటు నందమూరి ఫ్యాన్స్, అటు అక్కినేని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్‌ను మధ్యలో పెద్దగా హైలెట్ చేస్తూ.. మహానటుల ఫొటోలను పక్క వైపు పెట్టడాన్ని కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై రచ్చ రచ్చ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios