Asianet News TeluguAsianet News Telugu

‘భార‌తీయుడు 2’తెలుగులో ఎంతొస్తే బ్రేక్ ఈవెన్?

‘భార‌తీయుడు 2’చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.  

Kamal Hassan Indian 2 Break Even In Telugu states  jsp
Author
First Published Jul 9, 2024, 9:40 AM IST

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో  తెలుగులో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతైంది..ఎంతొస్తే బ్రేక్ ఈవెన్ వస్తుంది

‘భార‌తీయుడు 2’చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.  ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ...భారతీయుడు 2 చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 25 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలిసింది. శంకర్ బ్రాండ్ వాల్యూ, సీక్వెల్ కావటం, కమల్ హాసన్ ప్రధాన పాత్ర కావటంతో సినిమా అతి తక్కువ టైమ్ లోనే బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.  

 అయితే తమిళంలో ఈ సినిమాకు బజ్ ఎలా ఉందో గానీ తెలుగులో మాత్రం పెద్దగా లేదు.  మరో ప్రక్క ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపించేది ఎక్కువ సేపు కాదని అంటున్నారు. మరి సినిమా అంతా ఎవరు ఉంటారు అంటే  ‘భార‌య‌తీయుడు 2’ మొత్తం సిద్దార్థ్ చుట్టూ న‌డిచే క‌థ  అని ఇన్ సైడ్   టాక్‌. , అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే క‌మ‌ల్ కనపడతాడని అంటున్నారు.  ప్రీ క్లైమాక్స్ సమయంలో పూర్తి స్దాయి కమల్ దిగుతాడని చెప్తున్నారు. ఓ కొత్త రకం స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని డిజైన్ చేసినట్లు వినికిడి. అది వర్కవుట్ అయితే కొత్తగా ఉంటుందిట. కమల్ కనపడకపోయినా మనం ఫీల్ అవుతూంటాం అని చెప్తున్నారు. 
 
‘‘భారతీయుడు తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కమల్‌హాసన్‌ 360డిగ్రీల కంటే ఒక డిగ్రీ ఎక్కువ నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయన లాంటి నటుడు ప్రపంచంలోనే లేరు. తనతో ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ చేయడం ఆనందంగా ఉంది. ఈ రెండూ ‘భారతీయుడు’ కంటే పెద్ద హిట్‌ అవుతాయి’’ అన్నారు దర్శకుడు శంకర్‌. 
  
‘భార‌తీయుడు 2’ స్టోరీ లైన్ ని గ‌మ‌నిస్తే.. ‘భార‌తీయుడు’లో లంచానికి వ్య‌తిరేకంగా పోరాడిన వీర‌శేఖ‌రన్ సేనాప‌తి ఇండియాలో మ‌ళ్లీ త‌ప్పు జ‌రిగితే తాను తిరిగి వ‌స్తాన‌ని చెప్ప‌టంతో క‌థ ముగిసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ దేశంలో లంచ‌గొండిత‌నం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవ‌రూ ఏ ప‌నులు చేయ‌టం లేదు. దీంతో సామాన్యుడు బ‌త‌క‌ట‌మే క‌ష్టంగా మారింది. అప్పుడు భార‌తీయులంద‌రూ క‌మ్ బ్యాక్ ఇండియ‌న్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మ‌ళ్లీ దేశంలోకి భార‌తీయుడు అడుగు పెట్టాల‌ని రిక్వెస్టులు పంపుతారు. చివ‌ర‌కు వీర‌శేఖ‌ర‌న్ సేనాప‌తి ఇండియాలోకి అడుగు పెడ‌తారు.( Bharateeyudu 2)

వ‌చ్చిన త‌ర్వాత సేనాప‌తి ఏం చేశారు.. భార‌తీయుడుకి భ‌య‌ప‌డి లంచాలు మానేసిన అధికార‌లు మ‌ళ్లీ లంచాలు తీసుకోవ‌టానికి కార‌ణం ఎవ‌రు? పేట్రేగిన లంచం వ‌ల్ల దేశంలో ఎలాంటి అల్ల‌క‌ల్లోలాలు జ‌రిగాయి. అనే విష‌యాల‌ను ఈ సినిమాలో చాలా గ్రాండియ‌ర్‌గా చూపించనున్నారు డైరెక్ట‌ర్ శంక‌ర్‌. రిలీజైన గ్లింప్స్‌లోనే ఓ రేంజ్ గ్రాండియ‌ర్‌నెస్ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వసరం లేదు. సినిమా మేకింగ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిన డైరెక్ట‌ర్ శంక‌ర్, ఈసారి ‘భార‌తీయుడు 2’ చిత్రంతో ఎలాంటి సెన్సేష‌న్స్‌కు తెర తీయ‌బోతున్నారో తెలియాలంటే మూడు రోజులు ఆగాల్సిందే . ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios