Indian 2 : శంకర్ ‘ఇండియన్ 2’ నుంచి రేపే బిగ్ అప్డేట్.. టైమ్ ఫిక్స్
‘ఇండియన్ 2’ మూవీ ఇన్నాళ్లు బిగ్ అప్డేట్ ఇచ్చేందుకు యూనిట్ సిద్ధమైంది. ఈమేరకు టైమ్ ఫిక్స్ తాజాగా ప్రకటన చేశారు. రేపు సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ను ఇవ్వబోతున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం Indian 2. 1996లో ‘భారతీయుడు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈ కాంబోలో ఇప్పుడు సీక్వెల్ తో రాబోతోంది. రెండు దశాబ్దాల తర్వాత ‘భారతీయుడు’ సీక్వెల్ రాబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోవిడ్ కు ముందే ప్రారంభమైన ఈ చిత్రం పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేళలకు సినిమా తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే మూవీ షూటింగ్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ నుంచి చిన్న చిన్న అప్డేట్స్ మాత్రమే అందాయి. స్పెషల్ పోస్టర్స్ తోనే సరిపెట్టారు. ఈ మూవీ విషయంలో ఎలాంటి లీక్ లు లేకుండా శంకర్ జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో Indian 2 నుంచి సాలిడ్ అప్డేట్ ఎప్పుడు అందుతుందా.. అని అభిమానులు, సాధారణ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ అందించేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు అప్డేట్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. దీంతో రేపు కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో రేపు విడుదల తేదీపైనే అప్డేట్ రానుందని ప్రచారం. ఇప్పటికే సినిమా ఆలస్యం కావడంతో యూనిట్ ఎలాంటి అప్డేట్ ను అందించనుందనేది వేచి చూడాలి.
ఈ భారీ ప్రాజెక్ట్ ను లైకా ప్రొడక్షన్స్, రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ముత్తురాజ్ ఆర్ట్ డైరెక్షన్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.