60 ఏళ్ళ వయస్సులో మెషన్ గన్స్ తో కమల్ హాసన్ సాహసం, ఏ సినిమా కోసం..?
భారీ యాక్షన్ మూవీకోసం రెడీ అవుతున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. 70 ఏళ్ళకు దగ్గరగా ఉన్న తమిళ స్టార్ హీరో.. ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోలను మించిసాహసం చేయడానికి రెడీ అవుతున్నాడు.

చాలా కాలం హిట్టు లేక.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో భారీ ఊరట లభించింది. కమల్ కెరీర్ లోనే అత్యాధిక వసూళ్లు సాధించి ఈసినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక విక్రమ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ (Kamal Haasan) నెక్ట్స్ వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ పోతున్నాడు. అన్నీ కూడా భారీ సినిమాలు చేస్తున్నాడు కమల్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 (Indian 2) సినిమాను పరుగులు పెట్టిస్తున్న లోకనాయకుడు.. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు గుమ్మడికాయ కొట్టబోతున్నాడు.
ఇక ఇండియన్ 2తో పాటు.. సర్ ప్రైజింగ్ గా.. ప్రభాస్ కల్కి (Kalki2898AD) లో కూడా నటిస్తున్నాడు కమల్. ఈ సినిమాలో ప్రభాస్ తో పోరాడే.. పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉండగా.. ఈరెండు ప్రాజెక్ట్ లతో పాటు.. తమిళంలో దర్శకుడు హెచ్ వినోథ్ దర్శకత్వంలో తన 233వ సినిమాని ఎప్పుడో ప్రకటించేశాడు కమల్ హాసన్.. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈసినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
దర్శకుడు హెచ్ వినోథ్.. గతంలో ఖాకి, వలిమై, తెగింపు వంటి యాక్షన్ సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పుడు కమల్ తో కూడా అలాంటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ నే తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈప్రీ ప్రొడక్షన్ లో భాగంగా కమల్ హాసన్ మెషిన్ గన్స్‌తో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ ఏజ్ లో కూడా కమల్ మెషిన్ గన్స్ తో ఆడుకుుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కమల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ వీడియోని మేకర్స్ ఆడియన్స్ కి షేర్ చేశారు. ఇక ఈ వీడియోతో మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
విక్రమ్ సినిమాలో కూడా కమల్ మెషిన్ గన్స్ తో చేసిన యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలైట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ మూవీలో కూడా ఆ రేంజ్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. తన హోం బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రైజ్ టు రూల్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో నటించే నటీనటులు గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇండియన్ 2 షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లు సమాచారం ప్రస్తుతం ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఆ మూవీ రిలీజ్ డేట్ పై అనౌన్స్ రానుంది.