భారతీయుడు 2 మొదటి వారానికే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది.
శంకర్-కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారీ పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భారతీయుడు 2. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. భారతీయుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం. ఆ మూవీ ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అనగానే అంచనాలు సాధారణంగానే పెరిగాయి. అయితే ఫస్ట్ షో నుండే భారతీయుడు 2 నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఆ ప్రభావం వసూళ్ల మీద చూపింది. ఫస్ట్ డే భారతీయుడు 2 ఇండియాలో 25.6 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి భారతీయుడు 2 ఇండియాలో రూ. 70.45 కోట్ల నెట్ రాబట్టింది. వీకెండ్ వరకు వసూళ్లు పర్వాలేదు అన్నట్లు ఉన్నాయి. వర్కింగ్ డేస్ మొదలయ్యాక భారతీయుడు 2 పూర్తిగా చతికిలపడింది. వరల్డ్ వైడ్ 7 రోజుల్లో భారతీయుడు 2 రూ. 121.65 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.
భారతీయుడు 2 బడ్జెట్ దాదాపు రూ. 250 కోట్లు. ఈ క్రమంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. పార్ట్ 3 కోసం శంకర్ కథను పూర్తిగా చెప్పలేదు. ఎమోషనల్ టచ్ మిస్ అయ్యింది. సేనాపతి పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. కమల హాసన్ లుక్ కూడా మెప్పించలేదు అనేది ఆడియన్స్ అభిప్రాయం.
భారతీయుడు 2 అనేక వివాదాల మధ్య పూర్తి చేసి విడుదల చేశారు. దాదాపు మూలనపడిన ప్రాజెక్ట్ ని విక్రమ్ సక్సెస్ కావడంతో పట్టాలెక్కించారు. కాగా భారతీయుడు 2 మొదట దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. శంకర్ చెప్పిన బడ్జెట్ కి భయపడి వదులుకున్నారు. లైకా తో భారతీయుడు 2 చేశారు. అయితే గేమ్ ఛేంజర్ రూపంలో దిల్ రాజు అనుకోకుండా శంకర్ కి దొరికిపోయాడు. ప్రాజెక్ట్ డిలే చేసి బడ్జెట్ పెంచేశాడు. గేమ్ ఛేంజర్ అటు ఇటు అయితే.. దిల్ రాజుకు షాక్ తప్పదు...
