ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ కమిడియన్ బ్రహ్మానందం గత కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నారు. ఏవో టీవి షోలు, యాడ్స్ తప్పించి సినిమాలు రావటం లేదు. దాదాపు రిటైర్మెంట్ తీసుకున్న పరిస్దితి బ్రహ్మానందం కు వచ్చేసింది. అయితే ఆయన మళ్ళీ తన కామెడీతో అలరించాలని, ఓ పెద్ద హిట్ తో తిరిగి రీ లాంచ్ అవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఆయన్ని డీల్ చేసే కథ, దర్శకుడు సెట్ కావటం లేదు. కొత్త దర్శకులుకు ఆయన పాతబడిపోయారు. ఈ నేపధ్యంలో ఆయన ఆశలన్నీ...కమల్ హాసన్ పై పెట్టుకున్నారు. 

కమల్  హీరోగా .. ఆయనే దర్శక నిర్మాతగా 'శభాష్ నాయుడు' సినిమా షూటింగ్ చాలాకాలం క్రితం మొదలైంది. రమ్యకృష్ణ ..శ్రుతిహాసన్ .. బ్రహ్మానందం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర అయితే ఫుల్ లెంగ్త్. చాలా బాగా వచ్చిందని కమల్ మెచ్చుకోవటం, బ్రహ్మానందం సైతం ఆనందపడి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

అయితే అప్పట్లో షూటింగ్ సమయంలో ఆయన ప్రమాదానికి గురి కావడంతో కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలా  ఆగిపోయిన ఈ సినిమా షూటింగును తిరిగి మొదలుపెడతానని ఆయన అన్నారు..కానీ అది జరగలేదు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అది చాలా పెద్ద పని. కానీ షూట్ చేయాల్సిన పార్ట్ చాలా ఉంది. కానీ ఈ లోగా కమల్ తన రిటైర్మెంట్ ప్రకటించేసారు. 

కమల్‌హాసన్‌ రాజకీయ పార్టీ స్థాపించి 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.  తమిళనాట రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కమల్‌ ‘మక్కల్‌ నీది మయ్యం’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ పనులతో బిజీగా గడుపుతున్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాలకు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తానని ప్రకటించారు. అయితే.. మధ్యలో పెండింగ్‌లో ఉన్న ‘విశ్వరూపం 2’ను విడుదల చేశారు.  

రీసెంట్ గా శంకర్‌ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా  ‘భారతీయుడు 2’ ప్రారంభించారు. శంకర్‌ సినిమాల తరహాలో ఉంటూనే రాజకీయ కోణం కూడా అందులో ఉంటుందనీ, తన రాజకీయ పార్టీకు సంబంధించిన వ్యూహాలను ‘భారతీయుడు2’లో ప్రస్తావిస్తానని కమల్‌ ఇటీవల తెలిపారు. 

ఉన్నట్లుండి ఆయన  తన ఫ్యాన్స్ కు  ఓ షాక్‌ ఇచ్చారు. ‘భారతీయుడు 2’ తన చివరి చిత్రమనీ, ఆ తర్వాత రిటైర్‌ అవుతానని ఆయన మంగళవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  ఈ షాక్ ..అభిమానుల కన్నా ...బ్రహ్మానందం కు ఎక్కువ తగిలిందంటున్నారు. కమల్ 'శభాష్ నాయుడు'  సినిమా ని ఇక రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఈ విషయాన్ని జీర్ణించుకోవటం కష్టమే అయ్యిందని చెప్పుకుంటున్నారు.