Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ టైమ్ కమల్ హాసన్ తో జతకట్టబోతున్న నయనతార, క్రేజీ కాంబో పై వైరల్ అవుతున్న వార్తలు

 కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు ఎలా సెట్ అవుతాయోచెప్పడం కష్టం. అస్సలు ఆడియన్స్ ఊహించని కాంబోలో సడెన్ గా సెట్ అయ్యి.. ఆశ్చర్యపరుస్తుంటాయి. అటువంటి కాబినేషన్ త్వరలో కోలీవుడ్ లో సందడి చేయబోతోంది. 

Kamal Haasan Nayanthara Combination Movie Director Mani Ratnam JMS
Author
First Published Oct 22, 2023, 10:17 AM IST


ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు.. కొంత మంది హీరోలతో సినిమాలు చేయలేదు.. అసలు ఆ కాంబోలో సినిమాలు ఎందుకు రాలేదు అనేది కూడా ఆడియన్స్ పట్టించుకోలేదు. తన కెరీర్ మొత్తం మీద కాజల్ బాలయ్యతో సినిమా చేయలేదు.. తాజాగా భగవంత్ కేసరితో ఆ కాంబినేషన్ కలిసింది. ఇక తమిళనాట కూడా కమల్ హాసన్ తో నయనతార నటించలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా సినిమాలు చేసిన నయన్.. కమల్ తో మాత్రం జతకట్టే అవకాశం రాలేదు. ఇక తాజాగా వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇక సినిమాకెరీర్ అయిపోతుందేమో అనుకున్న టైమ్ లో విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఇక ఆసినిమా నుంచి ఆయనలో జోరు పెరిగింది.వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు కమల్ .ఇక కమల్ హాసన్ ప్రస్తుతం ప్రభాస్ పాన్ వరల్డ్  ప్రాజెక్ట్   కల్కి 2898 ఎడి లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. 

కల్కి విషయం పక్కన పెడితే.. కమల్ హాసన్.. మణిరత్నం దర్శకత్వంలో  ఓసినిమా చేయబోతున్నారు. ఈమూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. గతంలో కమల్- మణిరత్నం కాంబినేషన్లో  వచ్చిన నాయకుడు ఎంత  బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే.  ఇద్దరి కెరీర్లో ఆ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. చాలా కాలం తర్వాత ఈ కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాబోతుంది అంటే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. 

ఇక మణిరత్నంతో  కమల్‌ హాసన్ చేసే సినిమా ఆయన  కెరీర్లో  234వ సినిమాగా రూపొందబోతోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముందుగా ఈసినిమాకు త్రిష హీరోయిన్ గా  అనుకున్నారు. మణిరత్నం  పొన్నియన్ సెల్వన్ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించింది. అయితే ఆమె విజయ్ లియో సినిమాతో ఫామ్ లోకి రావడంతో.. కమల్ సినిమాలో కూడా త్రిషను తీసుకోవాలి అనుకున్నారు. కాని ఎందుకో మళ్ళి త్రిషను కాదని.. నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకుంటున్నారట. 

తమిళంలో దాదాపు అందరి స్టార్ హీరోలతో నయన్ నటించింది. కానీ కమల్ హాసన్ కి జోడిగా ఆమె చేయలేదు. త్వరలోనే ఈ రేర్ కాంబో కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్టు సమాచారం

Follow Us:
Download App:
  • android
  • ios