Asianet News TeluguAsianet News Telugu

ఆగిపోయిన కమల్ హాసన్ మూవీ.. 26 ఏళ్ళ తరువాత ట్విస్ట్ ఏంటంటే..?

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అది ఇప్పుడు కాదు.. 26 ఏళ్ళక్రితం ఆగిపోయిందీ సినిమా.. ఇన్నేళ్ళకు మళ్ళీ ఈమూవీ తెరపైకి రాబోతోంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్టేంటంటే..? 

Kamal Haasan Marudanayagan Movie On Sets After 26 Years JMS
Author
First Published Apr 1, 2023, 9:11 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో షూటింగ్ స్టార్ట్ అయిన అన్ని సినిమాలు.. తెరపైకి రావాలన్న రూలేమి లేదు.. ఆర్థిక ఇబ్బందులు.. హీరోల, హీరోయిన్లు.. నిర్మాతలకు డబ్బలు.. ఈగోలు.. గొడవలు.. కారణాలు ఏవైనా కావచ్చు.. సినిమా ఆగిపోడానికి. అలాంటి సినిమాలు వందల్లో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మళ్లీ సెట్స్ ఎక్కినా.. ఎక్కువ శాతం సినిమాలు మాత్రం మరుగున పడిపోయి ఉన్నాయి. కొన్ని సినిమాలయితే.. రిలీజ్ వరకూ వచ్చి మూలన పడేసినవే ఎక్కువ. ఇక కమల్ హాసన్ సినిమా ఒకటి అలానే మరుగున పడిపోయింది 26 ఏళ్ళ క్రితం. ఆ సినిమాపై ప్రస్తుతం ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. 

వివరాల్లోకి వెళ్తే... లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 1997లో ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆసినిమా పేరు మరుదనాయగన్. కమల్ హాసన్  హీరోగా..  టైటిల్ రోల్ పోషిస్తూ..  స్వీయ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అంతే కాదు షూటింగ్ ఓపెనింగ్ రోజు.. ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు.. సినిమా ఓపెనింగ్ కు వచ్చారు. దాంతో అప్పట్లో చరిత్ర సృష్టిస్తుంది ఈ సినిమా అని అనుకున్నారంతా..అయితే కారణం ఏంటో తెలియదు కాని.. ఈసినిమా ఆగిపోయి ఆడియన్స్ కుషాక్ ఇచ్చింది. ఇక అప్పుడు ఆగిపోయిన ఈసినిమా.. మళ్ళీ 26 సంవత్సరాల తర్వాత సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అసలెందుకు ఆగిపోయింది.. ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది...? 

1997లోస్టార్ట్ అయ్యి.. మరుదనాయగన్ సినిమా...  40 శాతం షూటింగ్ ను కూడా  కంప్లీట్ చేసుకుంది.  అయితే బడ్జెట్ కారణతో పాటు..మరికొన్ని కారణాలతో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయినప్పటికీ గతంలో చాలా సార్లు ఈ సినిమాను తప్పకుండా పూర్తి చేస్తానని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ..  కమల్ చెప్పుకొచ్చాడు.. హాలీవుడ్ నిర్మాతలు కూడా ఈసినిమాపై ఇంట్రెస్ట్ తో ఉన్నారన్నారు కమల్. ఈ క్రమంలోనే మళ్లీ 26 సంవత్సరాల తర్వాత మరుదనాయగన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు  తెలుస్తోంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే..  కమల్ హాసన్ హీరోగా అనుకున్న ఈసినిమాలో.. కమల్ పాత్రలో  హీరో విక్రమ్ ను తీసుకోవాలి అని చూస్తున్నారట. 

అంతే కాదు అప్పట్లో కమల్ నటించిన 40 శాతం షూటింగ్లో సీన్స్ ను ఈమూవీలో చేర్చేలా.. స్క్రీన్ ప్లే ను మార్చబోతున్నారట. బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ లాంటి  సినిమాల సక్సెస్ వల్లనే.. ఈసినిమా సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్టు తెలస్తోంది. . అయితే ఇందుకు సంబంధించిన అధికారికి ప్రకటన రిలీజ్  కావాల్సి ఉంది. 

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కమల్ హాసన్.  ఎన్నో గొప్ప క్యారెక్టర్లు వేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా.. డాన్సర్ గానే కాక..రాజకీయ నాయకుడిగా కూడా కమల్ హాసన్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పటికీ అదే ఎనర్జీతో దూసుకుపోతున్నాడు కమల్ హాసన్. 

Follow Us:
Download App:
  • android
  • ios