తాజాగా కమల్‌ హెల్త్ పై వైద్యులు అప్‌డేట్‌ ఇచ్చారు. కమల్‌ కోలుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, డిశ్చార్జ్ వివరాలను వెల్లడించారు.

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌(Kamal Haasan) ఇటీవల కరోనాకి గురైన విషయం తెలిసిందే. తాజాగా కమల్‌ హెల్త్ పై వైద్యులు అప్‌డేట్‌ ఇచ్చారు. కమల్‌ కోలుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ నెల 3న డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. Kamal Haasan ప్రస్తుతం శ్రీరామచంద్రా మెడికల్‌ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. 

ఇందులో వైద్యులు చెబుతూ, ప్రస్తుతం కమల్‌ హాసన్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 3న డిశ్చార్జ్ చేస్తాం. డిసెంబర్‌ 4 నుంచి కమల్‌ హాసన్‌ తన పనులను చేసుకోవచ్చు` అని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. దీంతో కమల్‌ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ ఇటీవల అమెరికా వెళ్లారు. తన సొంతం దుస్తుల బ్రాండ్‌ని ప్రారంభించేందుకు వెళ్లిన ఆయన అనంతరం తిరిగి చెన్నై చేసుకున్నారు. ఆ వెంటనే కమల్‌కి దగ్గు ప్రారంభమయ్యింది. దీంతో అనుమానంతో టెస్ట్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. 

Scroll to load tweet…

కరోనా సోకడంతో కమల్‌ ఈ నవంబర్‌ 22న చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో చేరారు. దాదాపు తొమ్మిది రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కమల్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యలు వెల్లడించడం విశేషం. కమల్‌ ప్రస్తుతం `విక్రమ్‌` సినిమాలో నటిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌ థ్రిలర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి, మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. 

దీంతోపాటు కమల్‌ హాసన్‌ `భారతీయుడు 2`లో నటించాల్సి ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనేక అవాంతరాల కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్‌ సైతం తెలుగులో రామ్‌చరణ్‌తో, హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో సినిమాలు చేస్తున్నారు. కమల్‌ తన `విక్రమ్‌` సినిమా పూర్తయిన తర్వాత `భారతీయుడు 2`పై దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కొత్తగా మరో సినిమాకి కూడా కమిట్‌ అయ్యాడని టాక్‌.

also read: Kajal Hot Alert: రెడ్‌ అలర్ట్ మోగించిన కాజల్‌.. సమంతని మించిపోతుందంటూ సెటైర్లు.. పిక్స్ వైరల్‌