Indian 2: ఇండియన్ 2 షూటింగ్ కు ట్రాఫిక్ కష్టాలు, కమల్ హాసన్ కు తప్పని తిప్పలు
మల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ ఇండియన్ 2. ఈమూవీ షూటింగ్ గత కొద్ది రోజులగా ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈమూవీకి సబంధించిన ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది.

కమల్ హాసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. విక్రమ్ సినిమాతో ఆయన మళ్ళీ పుంజుకున్నాడు. ఇదే ఊపుతో కమల్ భారతీయుడు 2 సినిమాను లైన్ లో పెట్టాడు. లోక నాయకుడు.. నట కమలం.. కమల్ హాసన్ హీరోగా శంకర్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు. ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు భారతీయుడు సినిమాకుసీక్వెల్ చేస్తున్నారు. దాదాపు చివరి దశలో ఉంది షూటింగం. భారతీయుడు 2 గా తెరకెక్కుతోన్న.. ఈసినిమాలో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతోంది. విజయవాడలో మొదలైన షూటింగ్.. రాజమండ్రిలో కొంత పూర్తి చేసుకుని.. తాజాగా విశాఖపట్నం చేరింది. వైజాగ్ లో కొన్ని రోజులు షూటింగ్ జరపడానికి ప్లాన్ చేసుకున్నారు టీమ్. కాగా ఈమూవీ షూటింగ్ కు ఇక్కడ కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఇండియన్2 షూటింగ్ కు.. వైజాల్ లో ట్రాఫీక్ కష్టాలు తప్పడం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే..?
భారతీయుడు-2 సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖలో జరుగుతుంది. చినగదిలి నుంచి ముడసర్లోవ ప్రాంతం వరకు BRTS రోడ్ లో భారతీయుడు-2 సినిమా షూటింగ్ జరుగుతుంది. నాలుగు లైన్ల BRTS రోడ్లలో మధ్యలోని రెండు లైన్లు సినిమా షూటింగ్‌కు తీసుకున్నారు. దీంతో హనుమంతవాక నుంచి సింహాచలం వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఇటు భారతీయుడు-2 షూటింగ్ కు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది భారతీయుడు2 షూటింగ్.. శంకర్ కూడా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ను కూడా పక్కన పెట్టి.. తన టైమ్ మొత్తాన్నిఇండియన్ 2 సినిమాకే కేటాయిస్తున్నాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఈ భారీ చిత్రం ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది.