Kamal Haasan: ఆంధ్రా అంతటా తిరుగుతున్న కమల్ హాసన్, విశాఖపట్నంలో ఇండియన్ 2 షూటింగ్,
ఆంధ్రలో ఇండియన్ 2 వరుస షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు కమల్ హాసన్ టీమ్. ఇప్పటికే చాలా రోజులుగా ఆంధ్రాలో మకాం వేసింది టీమ్.. తాజాగా ఇండియన్ 2 టీమ్ వైజాగ్ చేరింది.

లోకనాయకుడు కమల్ హాసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. విక్రమ్ సినిమాతో ఆయన మళ్ళీ పుంజుకున్నాడు. ఇదే ఊపుతో కమల్ భారతీయుడు 2 సినిమాను లైన్ లో పెట్టాడు. లోక నాయకుడు.. నట కమలం.. కమల్ హాసన్ హీరోగా శంకర్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు. ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు భారతీయుడు సినిమాకుసీక్వెల్ చేస్తున్నారు. దాదాపు చివరి దశలో ఉంది షూటింగం. భారతీయుడు 2 గా తెరకెక్కుతోన్న.. ఈసినిమాలో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కొన్ని కారణాల వల్ల ఈమూవీ డిలై అవుతూ వచ్చింది. కొన్నాళ్లు ఆగిపోయింది కూడా. గత కొన్నేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడంతో షూటింగ్ చివరి దశకు వచ్చింది అంనుకున్నారు అంతా. ఇక ఈ చిత్రం షూటింగ్ ని అయితే దర్శకుడు శంకర్ వరల్డ్ వైడ్ గా అనేక ప్రాంతాల్లో తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా భారతీయుడు టీమ్ ఆధ్రా చేరారు. ప్రతి చోట కూడా తనదైన భారీతనంతో శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇండియన్ 2' సినిమా "షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. విశాఖలోని హార్బర్ ఏరియా, పరిసర ప్రాంతాలలో కమల్ హాసన్ సహా ఇతర మెయిన్ కాస్ట్ తో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఈనెల 14న విశాఖలో ఇండియన్ 2 షెడ్యూల్ ప్రారంభమైంది. సుమారు ఎనిమిది రోజుల పాటు షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో విశాఖ షెడ్యూల్ పూర్తి కావాలి.
స
మొన్నటి వరకూ బెజవాడలో షూటింగ్ జరుపుకున్నారు ఇండియన్ 2 టీమ్. ఇక్కడ ఓ క్రేజీ సీక్వెన్స్ ను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ కోసం 8000 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకున్నట్టు సమాచారం.విజయవాడలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో అయితే షూట్ చేశారట. అంతే కాదు... షూటింగ నిమిత్తం విజయవాడ వచ్చిన కమల్ హాసన్ అక్కడ కృష్ణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.