గుడ్ మార్నింగ్ అమెరికా... హాలీవుడ్ నుంచి హాయ్ చెప్పిన కమల్ హాసన్.
అమెరికాలో వాలిపోయారు ప్రాజెక్ట్ కె టీమ్. ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం హాలీవుడ్ లో సందడి చేయబోతున్నారు. తాజాగా అమెరికాకు గుడ్ మార్నింగ్ చెపుతూ..కమల్ హాసన్ ఫోటోతో పోస్ట్ ను పంచుకున్నారు టీమ్.

గుడ్ మార్నింగ్ అమెరికా అంటున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. హాలీవుడ్ నుంచి కమల్ హాసన్ ఫొటోని ప్రాజెక్ట్ కె మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెరికా వీధుల్లో కమల్ హాసన్ సరదాగా నడుస్తున్న ఫొటోని షేర్ చేసి గుడ్ మార్నింగ్ అమెరికా.. లవ్ ఫ్రమ్ సిటీ అఫ్ రైజింగ్ సన్ అని పోస్ట్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అద్భుతమైన ఈవెంట్ కోసం అమెరికా చేరారు ప్రాజెక్ట్ కె టీమ్. ఇప్పటికే ప్రభాస్ తో పాటు.. రానా లాంటి ప్రముఖులు అక్కడ సందడి చేస్తున్నారు. ఇంతకీ విశేషం ఏంటంటే..?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే , కమల్ హాసన్.. దిశా పఠాని లాంటి స్టార్స్ సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.ఇక కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ఏమని ప్రకటిస్తారా, ఎలాంటి గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023
ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకు రాలేదు. ఈ గౌరవం దక్కిన మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ఈవెంట్ లోపాల్గొనటానికి ఇప్పటికే డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో పాటు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అమెరికా చేరారు. వీరు పాల్గొనబోతున్నట్లు నిర్మాతలు ఇంతకు ముందే ప్రకటించారు. అయితే వీరితో పాటు రానా కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, రానా అమెరికాకు చేరుకున్నట్టు హాలీవుడ్ నుంచి ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ చేశారు.