కమల్ హాసన్ దిల్ ఖుష్ అయ్యారు. ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నారు. చాలా కాలం తరువాత హిట్ కొట్టడంతో పట్టలేని ఆనందంలో మునిగితేలుతున్నాడు కమల్. తనకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు.
చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు కమల్ హాసన్. గతంలో వరుస ప్లాప్ లు చూసిన స్టార్ హీరో.. విశ్వరూపం,విశ్వరూపం2 లాంటి సినిమాలతో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఒక రకంగా దశావతారం తరువాత కమల్ కు హిట్ సినిమా లేదనే చెప్పాలి. అటువంటి టైమ్ లో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నారు.
కమల్ తన సొంత బ్యానర్లో విక్రమ్' సినిమాను నిర్మించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. . హీరోయిన్ లేకుండా ఐదుగురు స్టార్స్ తో మొదటి నుంచి చివరి వరకూ లోకేశ్ కథను నడిపించాడు. కమల్ స్థాయికి తగ్గట్టు...వెయిట్ ఉన్న పాత్రతో.. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో.. ఎక్కడా తగ్గకుండా ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు.
అటు కోలీవుడ్ ..ఇటు టాలీవుడ్ లోనే కాకుండా ఓవర్ సిస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. చాలా గ్యాప్ తరువాత హీరోగా .. నిర్మాతగా భారీ సక్సెస్ ను కమల్ ఎంజాయ్ చేస్తున్నారు. విక్రమ్ హిట్ తో దిల్ ఖుష్ అయ్యారు కమల్ ఈ నేపథ్యంలో .. ఈ సంతోషంలో ఆయన ఈ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి ఖరీదైన కారును గిఫ్ట్ గా అందజేశారు.
కోటి రూపాయలకి పైగా ఖరీదైన లెక్సస్ సెడాన్ కారును కానుకగా లోకేశ్ అందుకుంటున్నాడు. కారుతో పాటు కమల్, లోకేష్ ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేశ్ ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చాడనీ .. అలాంటి వాళ్లంటే తనకి ఇష్టమని చెబుతూ వచ్చిన కమల్, అతని పట్ల తనకి గల అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు.
విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈవిక్రమ్ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం.
