లోకనాయకుడు.. తమిళ లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్వతహాగా నాస్తికుడైన కమల్ ఈసారి హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలు ప్రకపంనలు సృష్టిస్తున్నాయి. ఇక చిత్రం ఏమిటంటే.. ఈ వివాదం పొన్నియన్ సెల్వన్ చుట్టు తిరుగుతుండటం విశేషం.
సౌత్ స్టార్ హీరో కమల హాసన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ రాజ చోళుడు హిందూ రాజు కాదనే అభిప్రయాన్ని ఆయన బలపరిచారు. దాంతో ఈ వివాదం అంటుకుని తగలబడుతుంది. అయితే ఈ వాఖ్యలు ఆయన మరోకరి వ్యాఖ్యలకు సపోర్ట్ గా అనడంతో.. ప్రస్తుం ఇది పెద్ద తుఫానుగా మారింది. రీసెంట్ గా జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేసిన వివాదాస్పద మాటలను కమల్ హాసన్ సమర్థించారు. ఓ ఈవెంట్ కి హాజరైన వెట్రిమారన్ మాట్లాడుతూ.. రాజ రాజా చోళన్ హిందువు కాదు అని అన్నారు.
అంతే కాదు ఆయన హిందు కాదు.. కాని బీజేపీ మాత్రం మన గుర్తింపును దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లు ఇప్పటికే తిరువల్లువర్‌కు కాషాయం పులమడానికి ప్రయత్నించారు. మనం దీన్ని ఎప్పటికీ ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ సంచలన వాఖ్యలు చేశారు. అయితే ఇక్కడే చిన్నట్విస్ట్ ఉంది. రాజరాజ చోళస్ఫూర్తితో కల్పిత నవల ఆధారంగా తమిళనాడు లో ప్రస్టేజియస్ గా రూపొందిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్1 రిలీజ్ అయిన నెక్ట్స్ డేనే వెట్రిమారన్ ఇలా మాట్లాడటం విశేషం.
ఇక తాజాగా దర్శకుడు వెట్రిమారన్ మాటలను సమర్థించేలా స్టార్ హీరో కమలహాసన్ ఇదే భావంలో వ్యాఖ్యలు చేశారు. కమల్ ఏమన్నారంటే రాజ రాజ చోళుని కాలంలో అసలు హిందూ మతం అనే పేరే లేదు. వైష్ణవం, శైవం, సమానం మాత్రమే ఉన్నాయి. వీటిని కలిపి ఎలా పిలవాలో తెలియక తెల్లవారు వారికి హిందూ అనే పదాన్ని తగిలించారు అని అన్నారు. దీని కోసం ఆయన ఓ ఉదాహరణ కూడా చెప్పారు కమల్.. బ్రిటీష్ వారికి తుత్తుకుడిని పలకడం చేతకాక టుటికోరిన్‌గా ఎలా మార్చారో అదే విధంగా హిందూ అనే పదాన్ని వాడారు అని కమల హాసన్ అన్నారు.
ఇక తమిళ నాట దర్శకుడు వెట్రిమారన్, కమల హాసన్ వ్యాఖ్యలపై మంటలు రేగుతున్నాయి. ఈ వాఖ్యలపై బీజేపీ నేతలు భారీగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ రాజ చోళుడు నిజంగా హిందూ రాజు అని బీజేపీ నేతల వాదిస్తున్నారు. ఆయన హిందూ రాజు కాకపోతే.. చర్చిలు, మసీదులను కట్టిచాడా..? ఏది చూపించండి అని సవాల్ విసురుతున్నారు.
