కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా విక్రమ్ నిలిచింది. కమల్ హాసన్ విజృంభిస్తే బాక్సాఫీస్ ఈ స్థాయిలో షేక్ అవుతుందో నిరూపించారు. విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో జూన్ 17న చెన్నైలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. 

ఈ ఏడాది సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకు బాగా కలిసొచ్చింది. మూడు పెద్ద చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఆర్ ఆర్ ఆర్ ని మించిన విజయం కెజిఎఫ్ 2 నమోదు చేయగా రెండున్నర దశాబ్దాల తర్వాత విక్రమ్ మూవీతో కమల్ హాసన్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. విక్రమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 350 కోట్లకు చేరువయ్యాయి. ఇండియాలో విక్రమ్ రూ. 230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో విక్రమ్ రూ. 15 కోట్ల షేర్ వరకూ రాబట్టింది. 

మూడు వారాల తర్వాత కూడా విక్రమ్ (Vikram) థియేటర్స్ లో సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా విక్రమ్ నిలిచింది. కమల్ హాసన్ విజృంభిస్తే బాక్సాఫీస్ ఈ స్థాయిలో షేక్ అవుతుందో నిరూపించారు. విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో జూన్ 17న చెన్నైలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ ల విక్రమ్ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు పాల్గొన్నారు. ఈ వేదికపై నుండి కమల్ ఆనందం వ్యక్తం చేశారు. విక్రమ్ సక్సెస్ లో భాగమైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 

దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో పాటు అనిరుధ్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈవెంట్ ముగిశాక రుచికరమైన నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో టాలీవుడ్ నుండి సందీప్ కిషన్ హాజరైనట్లు సమాచారం. విక్రమ్ చిత్ర నిర్మాతగా ఉన్న కమల్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ మూవీకి వచ్చిన డబ్బులతో నా అప్పులన్నీ తీర్చుకుంటాను, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చేయగలిగిన సహాయం చేస్తాను. మనస్ఫూర్తిగా నచ్చినది తింటానని, కమల్ హాసన్ చెప్పిన విషయం తెలిసిందే. 

దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి లగ్జరీ కారు, నటుడు సూర్యకు రోలెక్స్ వాచ్ బహుమతులుగా ఇచ్చిన కమల్ హాసన్ (Kamal Haasan), అసిస్టెంట్ దర్శకులకు బైక్స్ గిఫ్ట్స్ గా ఇచ్చాడు. విక్రమ్ తో కమల్ హాసన్ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇక డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రివేంజ్ యాక్షన్ డ్రామాగా విక్రమ్ తెరకెక్కింది. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేయగా, సూర్య గెస్ట్ రోల్ చేసి అదరగొట్టారు.