కమల్‌ హాసన్‌.. విశ్వనటుడు. ఇండియన్‌ సినిమాని ప్రభావితం చేసిన విలక్షణ నటుడు. నటుడితో అనేక అరుదైన ప్రయోగాలు చేసి మెప్పించిన ఘనుడు. ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌. ఇండియన్‌ సినిమాలోని విలక్షణత్వాన్ని ఇతర దేశాల సినిమాకి పరిచయం చేసిన మేటి నటుడు. నటుడిగా, డాన్సర్‌గా, దర్శకుడిగా, స్క్రీన్‌ రైటర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా, రచయితగా, రాజకీయ నాయకుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న కమల్‌ హాసన్‌ బర్త్ డే ఈ నెల 7న. 

 `ఉలగనాయగన్‌` అని ముద్దుగా ఆయన అభిమానులు పిలుకునే కమల్‌ బర్త్ డే కామన్‌ డీపీని విడుదల చేశారు. ఇతర హీరోల సీడీపీల మాదిరిగా ఓ పది సినిమాల లుక్‌లు కాకుండా కేవలం ఒకే ఒక్క కమల్‌ని, అది కూడా లీడర్‌బర్త్ డే సీడీపీ పేరుతో దీన్ని విడుదల చేశారు. ఇందులో బ్రిటీష్‌ అధికారి తరహాలో పవర్‌ఫుల్‌ లుక్‌లో కమల్‌ కనిపిస్తున్నారు. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మూడు రోజుల ముందే కమల్‌ బర్త్ సందడి ప్రారంభమైందనే సంకేతాన్నిస్తుంది. 

ప్రస్తుతం కమల్‌ తన కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, కెరీర్‌ని మరో మెట్టు ఎక్కించిన `భారతీయుడు` సీక్వెల్‌ `భారతీయుడు 2`లో నటిస్తున్నారు. దీంతోపాటు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో 232వ సినిమా చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. మరోవైపు `మక్కల్‌ నీధి మైమ్‌ ఇంకుంబెంట్‌` అనే పార్టీ స్థాపించి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.