తమిళంలో `బిగ్‌బాస్‌ అల్టీమేట్` షో ఓటీటీ లో రన్‌ అవుతుంది. విజయ్‌ టీవీలో ఇది ప్రసారమవుతుంది. బిగ్‌బాస్ తమిళ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్‌ హాసనే ఈ ఓటీటీ షోకి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తన డేట్స్ సమస్య కారణంగా ఈ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు కమల్‌ తెలిపారు. 

తమిళ బిగ్‌బాస్‌(Biggboss Tamil) ప్రియులకు లోకనాయకుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan) షాకిచ్చారు. ఊహించని విధంగా ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. తాను హోస్ట్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు కమల్‌. తాజాగా ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఓపెన్‌ లెటర్‌ని పంచుకున్నారు. తాను నటిస్తున్న `విక్రమ్‌`(Vikram Movie) సినిమాతో, తమిళ `బిగ్‌బాస్‌ అల్టీమేట్‌`ఓటీటీ(OTT BiggBoss Ultimate) షో డేట్స్ క్లాష్‌ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్‌ హాసన్‌ తెలిపారు. 

తమిళంలో `బిగ్‌బాస్‌ అల్టీమేట్` షో ఓటీటీ లో రన్‌ అవుతుంది. విజయ్‌ టీవీలో ఇది ప్రసారమవుతుంది. బిగ్‌బాస్ తమిళ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న Kamal ఈ ఓటీటీ షోకి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తన డేట్స్ సమస్య కారణంగా ఈ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు కమల్‌ తెలిపారు. ఫిబ్రవరి 20(ఆదివారం) నుంచే ఆయన ఈ షో నుంచి వైదొలిగినట్టు వెల్లడించారు. ఇకపై తాను హోస్ట్ గా రాలేనని తెలిపారు. 

Scroll to load tweet…

కరోనా మహమ్మారి కారణంగా తాను ప్రస్తుతం నటిస్తున్న `విక్రమ్‌` సినిమా షూటింగ్‌ వాయిదా పడటంతో అన్నింటిలోనూ సందిగ్దం నెలకొందని, డేట్స్ ఓవర్‌లాప్‌ అయ్యాయని, ఇప్పుడు కరోనా తగ్గడంతో `విక్రమ్‌` సినిమా షూటింగ్‌ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ప్రముఖ స్టార్స్ ఇందులో నటిస్తున్న నేపథ్యంలో వారి డేట్స్, ప్రొడక్షన్‌ వర్క్ వంటివి అన్నింటి విషయంలో సినిమా షూటింగ్‌కి, బిగ్‌బాస్‌ షోకి డేట్స్ కేటాయించడం కుదరడం లేదని, అందుకే తాను షో నుంచి తప్పుకుంటున్నట్టు కమల్‌ తెలిపారు. 

అయితే బిగ్‌బాస్‌ తమిళ రియాలిటీ షోకి హోస్ట్ గా చేయడం వల్ల తాను ఎలాంటి ఇబ్బందిని ఫేస్‌ చేయలేదని, చాలా సంతోషంగా, ఇష్టంగా చేసినట్టు చెప్పిన కమల్‌ కోవిడ్‌ కారణంగా కాస్త డౌన్‌ అయినట్టు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితిని విజయ్‌ టీవీ యాజమాన్యానికి వివరించానని, వారు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారని తెలిపారు. వారు తనకు బాగా సపోర్ట్ చేశారని, వారి అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు కమల్‌. `బిగ్‌బాస్‌ తమిళ 6` షోతో మళ్లీ కలుస్తానని లోకనాయకుడు వెల్లడించారు.

కమల్‌ హాసన్‌ ప్రస్తుతం తమిళంలో `విక్రమ్‌` చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతుంది. దీన్ని కమల్‌ తన రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.