Asianet News TeluguAsianet News Telugu

రాజ్ తరుణ్ కి హిట్ ఇచ్చిన డైరక్టర్ తో కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం?

 ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ పాత్ర చాలా ప‌వ‌ర్ఫుల్ గా ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. 

Kalyanram sign one more film? jsp
Author
First Published Aug 29, 2024, 9:18 AM IST | Last Updated Aug 29, 2024, 9:18 AM IST

నంద‌మూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ల రెండు చెప్పుకోదగ్గ చిత్రాలు అతనొక్కడే, బింబిసార వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, నిర్మాతగా కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్న కల్యాణ్ రామ్  ప్రస్తుతం త‌న కెరీర్ లో 21వ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ పాత్ర చాలా ప‌వ‌ర్ఫుల్ గా ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఓ చిత్రం కథ విని ఓకే చెప్పారని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు..

కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ అశోశియేట్ చేసి దర్శకుడు అయిన సూర్య ప్రతాప్ కథ ఓకే చేసినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య ప్రతాప్ గతంలో రాజ్ తరుణ్ కు కుమారి 21F వంటి హిట్ ఇచ్చారు. అలాగే నిఖిల్ తో  18 పేజీస్ సినిమా చేసిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, నందమూరి కళ్యాణ్ రామ్‌కి ఓ కథను చెప్పాడట. ఈ కథ నచ్చిన కళ్యాణ్ రామ్ సూర్య ప్రతాప్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను త్వరలోనే పట్టాలకెక్కించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సుకుమార్ శిష్యుడైన సూర్య ప్రతాప్ తెరకెక్కించే సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కో-ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. 
 
 ప్రదీప్ చిలుకూరు చేస్తున్న  చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ ను పెట్టేందుకు మేక‌ర్స్ ఇంట్రస్ట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.   ఇక ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో న‌టిస్తున్నారు. అందాల భామ సాయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ సినిమాకు అజ‌నీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios