కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి అసలు  మాట్లాడటం లేదు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఎక్కడా కొత్త రిలీజడ్ డేట్ పోస్టర్స్ ని షేర్ చెయ్యలేదు. 


స్టార్ హీరోలంతా తమ సినిమాలను భుజాలపై వేసకుని మోస్తున్నారు. అయితే వివాదం ఉన్నప్పుడు పరిస్దితి ఏమిటి..అదే డైలమో నందమూరి కళ్యాణ్ రామ్క ఉన్నట్లుంది. దాంతో హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ ప్రమోషన్ విషయంలో ఆయన ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ‘బింబిసార’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తోన్న మరో వైవిధ్యమైన చిత్రం కావటం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే దర్శకుడు నవీన్ మేడారం కు, నిర్మాత అభిషేక్ నామాకు మధ్యన విభేధాలు రావటంతో కొద్ది రోజులు ఇబ్బందుల్లో పడింది. దర్శకుడుగా నవీన్ పేరుని తొలిగించి తన పేరుని వేసుకున్నారు రీసెంట్ పోస్టర్స్ లో నిర్మాత. అయితే కళ్యాణ్ రామ్ ఈ విభేధాలలో తలదూర్చదలుచుకోలేదు. ఆయన ఈ ఇన్సిడెంట్ పై స్పందించలేదు.

 అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు కూడా కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఎక్కడా కొత్త రిలీజడ్ డేట్ పోస్టర్స్ ని షేర్ చెయ్యలేదు. రిలీజ్ డేట్ ఈ నెల 29 కావటంతో థియేటర్ రన్ కు సంక్రాంతి సినిమాలు అడ్డం వస్తాయి. ఈ విషయం మీద ఆయన అసంతృప్తిగా ఉన్నారా లేక ఈ విభేదం పట్ల కోపంగా ఉండి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడటం లేదో తెలియటం లేదు. దాంతో కళ్యాణ్ రామ్ అభిమానులుకు ఈ సినిమా విషయంలో ఎలా స్పందించాలో ,రెస్పాండ్ కావాలో తెలియని డైలమో సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. తమ హీరో సినిమా అని ప్రమోట్ చెయ్యాలా లేక కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు కాబట్టి తాము కూడా అదే ఫాలో కావాలో తెలియని సిట్యువేషన్ నెలకొంది. 

ఇక ఇప్పటికే కళ్యాణ్ రామ్ లుక్, సినిమా క్వాలిటీకి మంచి స్పందన వచ్చింది. అలాగే హీరోయిన్స్ సంయుక్త మీనన్, మాళవిక నాయర్ లుక్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జానర్‌లో ఈ మూవీ ఉంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డెవిల్’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా ‘డెవిల్’ విడుదల కాబోతోంది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ ఐదు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు.

‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్కని ఒక ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌గా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించడానికి రెడీ అవుతున్నారు.