టాలీవుడ్ సమ్మర్ లో ఇప్పుడు అసలైన సినిమా కొంత జోష్ చూపిస్తోంది. వివాదాలు ఏ  రేంజ్ లో ఉన్నా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే అందుతాయని చెప్పవచ్చు. సినిమా సంగతి అటుంచితే సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్ ఈ సినిమాతో ఎంతవరకు క్లిక్ అవుతాడనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

మొన్న అన్న కీరవాణి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలకు మ్యూజిక్ ఇచ్చిభజన చేశాడు అన్నట్టుగా విమర్శలను అందుకున్నారు. అందులో కీరవాణి పాత్ర పెద్దగా లేదనే చెప్పాలి. బాలకృష్ణ - క్రిష్ చెప్పినట్టుగానే నడుచుకొని సాంగ్స్ చేశాడు. కానీ కథానాయిక సాంగ్ తప్పితే ఏ సాంగ్ కూడా అంతగా క్లిక్కవ్వలేదు. 

ఇక ఇప్పుడు తమ్ముడు  కళ్యాణి మాలిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం చేసిన సాంగ్స్ పెద్దగా పాపులర్ ఏమి అవ్వలేదు. వర్మ శైలిని బట్టి ఎప్పుడు లేని విధంగా కళ్యాణ్ కొత్త కసి ఎదో చూపించాడు. సాంగ్స్ అయితే రెండవసారి వినేలా లేవు. అయితే సినిమా కథలో భాగంగా వచ్చే పాటలు కాబట్టి వాటి ప్రభావం ఎంత ఉందొ తెరపై చూడాలి. 

మొత్తానికి అన్న ఎన్టీఆర్ ని పొగుడుతూ పాటలు రాస్తే.. ఇక బ్రదర్ మాలిక్ ఎన్టీఆర్ కి జరిగిన మోసంపై బాబును తిడుతూ కొత్త బాణీలు ట్రై చేశాడు. కథానాయకుడు - మహానాయకుడు సినిమాల వల్ల కీరవాణి కెరీర్ కు పెద్దగా ఎఫెక్ట్ పడదు. రాజమౌళి ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ RRR తో కవర్ చేసేస్తాడు. 

కానీ కళ్యాణి మాలిక్ కు ఈ సినిమా చాలా ముఖ్యం. అప్పుడెప్పుడో ఆంధ్రుడు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఇంతవరకు సరైన బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ హిట్టయితే ఈ సంగీత సోదరుడి కెరీర్ ఎలాంటి యూ టర్న్ తీసుకుంటుందో చూడాలి.