అక్కినేని అఖిల్ నటిస్తోన్న 'మిస్టర్ మజ్ను' సినిమా షూటింగ్ మరో పదిరోజుల్లో పూర్తి కానుంది. మొదటి నుండి చెబుతున్నట్లుగానే ఈ సినిమాను జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న సినిమా విడుదల కానుంది. నిజానికి అఖిల్ తో పాటు కళ్యాణ్ రామ్ సినిమా '118' కూడా విడుదల కావాల్సివుంది. ఇ

ద్దరూ జనవరి ఎండింగ్ లోనే థియేటర్లలోకి రావాలనుకున్నారు. కానీ ఇప్పుడు అఖిల్ కోసం కళ్యాణ్ రామ్ తన సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సమాచారం. గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరుగా అంచనాలు నెలకొన్నాయి. జనవరిలో రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నారట. 

అఖిల్ కి, కళ్యాణ్ రామ్ లకు ప్రస్తుతం సరైన హిట్స్ లేవు.. ఈ క్రమంలో ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగితే ఓపెనింగ్స్ విషయంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆ కారణంగానే కళ్యాణ్ రామ్ తన సినిమాను వాయిదా వేస్తున్నాడని తెలుస్తోంది.