నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తోన్న స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118'. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి. గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న భారీగా విడుదల కాబోతోంది. వైవిధ్యమైన కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌‌లు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు జరిగిందో చూద్దాం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 14 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అందులో ఏడు కోట్లు ధియోటకల్ బిజినెస్ అని చెప్తున్నారు.  అన్ని ఖర్చులు కలిపి 11 కోట్లు పెట్టారని...కాబట్టి మూడు కోట్లు టేబుల్ ప్రాఫిట అని తెలుస్తోంది. ఏరియా వైజ్ గా బిజినెక్ బ్రేకప్ చూద్దాం. 

ఏరియా.............................................       (కోట్లలో)

నైజాం &  ఆంధ్రా                                      5.00

సీడెడ్                                                      1.00

అమెరికా &మిగిలిన ప్రాంతాలు                  0.90

మొత్తం ధియోటర్ రైట్స్                           6.90

హిందీ డబ్బింగ్ రైట్స్                               4.00

శాటిలైట్ రైట్స్                                         3.10

ఓవరాల్ గా ప్రీ రిలీజ్  బిజినెస్               14.00