ఒక సినిమా కథ ఇండస్ట్రీలో ఇద్దరి ముగ్గురి హీరోల తలుపులు తట్టడం కామన్. చివరకి ఎవరో ఒకరిదగ్గర ఎలాంటి కథ అయినా ఊహించని విధంగా సెట్స్ పైకి వెళ్లడం సర్వసాధారణం. రీసెంట్ గా మెగా హీరోకు సెట్టయ్యింది అనుకున్న ఫాంటసీ కథ కూడా అలాగే నందమూరి హీరో దగ్గరకు చేరడం విశేషం. 

ఇటీవల 118సినిమాతో ప్రయోగం చేసి పర్వాలేదనిపించుకున్న కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో బిజీ అయ్యాడు. తుగ్లక్ కి సంబందించిన కథను ఇటీవల వేణు అనే ఒక కొత్త దర్శకుడు చెప్పాడట. విన్న వెంటనే మరో మాట అనకుండా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట ఈ కథ మెగా కాంపౌండ్ లో అల్లు శిరీష్ కోసం వెళ్లినట్లు సమాచారం.  

అక్కడ సెట్ అవ్వకపోవడంతో కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్ళింది. ఇక ఫాంటసీ చిత్రం కావడంతో బడ్జెట్ ఎక్కువ అవుతుందని మరో నిర్మాతను కలవకుండా సినిమాను సొంత ప్రొడక్షన్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మించేందుకు కళ్యాణ్ రామ్  సిద్దమవుతున్నాడు. మరి ఈ సినిమాతో అయినా కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంటుదో లేదో చూడాలి.