కళ్యాణ్‌ రామ్‌ తన అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన తాత ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సోషియో ఫాంటసీ కథతో రూపొందుతున్న `బింబిసార` చిత్రంలో నటిస్తున్నారు. మైథికల్‌ ల్యాండ్‌లో బార్బేరియన్‌ కింగ్‌గా కళ్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నట్టు తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌లో తెలుస్తుంది. `బాహుబలి`, `మగధీర` చిత్ర పోస్టర్లని తలపించేలా ఉన్న ఈ పోస్టర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కి మాత్రం గూస్‌బమ్స్ ని తెప్పిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు కావడం విశేషం. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన పోస్టర్‌‌లో `ఏ టైమ్ ట్రావెల్‌ టూ ఈవిల్ టూ గుడ్` అని, చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అన్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ ఇందులో గతంలో ఎప్పుడూ చేయనటువంటి పాత్రని, గతంలో ఎప్పుడూ కనిపించనటువంటి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు.

 ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించనున్నారు. ఇది చారిత్రక సినిమానా.. లేకపోత కాల్పినిక కథాంశంతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీనా  అనేది తెలియాల్సి ఉంది. అయితే పోస్టర్‌ `బాహుబలి`, `మగధీర` చిత్రాలను తలపించడం ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. చూడబోతే ఇది పాన్‌ ఇండియా లెవల్‌లో ప్లాన్‌ చేసినట్టు టాక్‌.