బాలయ్య బాబాయ్‌ వల్లే తన సినీ జర్నీ స్టార్ట్ అయ్యిందని, ఆయనే తనని సినిమాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు కళ్యాణ్‌ రామ్‌. తాజాగా ఆయన తన సినీ జర్నీని, సినిమాకి సంబంధించిన తన అనుభవాలను తెలియజేస్తూ ప్రత్యేకంగా ఓ వీడియోని పంచుకున్నారు.

నందమూరి కళ్యాణ్‌ రామ్‌(Kalyan Ram).. బాలకృష్ణ(Balakrishna) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమా జర్నీ ఎలా ప్రారంభమయ్యిందో తెలిపారు. బాలయ్య బాబాయ్‌ వల్లే తన సినీ జర్నీ స్టార్ట్ అయ్యిందని, ఆయనే తనని సినిమాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. తాజాగా ఆయన తన సినీ జర్నీని, సినిమాకి సంబంధించిన తన అనుభవాలను తెలియజేస్తూ ప్రత్యేకంగా ఓ వీడియోని పంచుకున్నారు. ఇందులో ఆయన ఇంట్రెస్టింగ్‌ విషయాలను తెలిపారు. 

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన చిత్రం `బింబిసార`(Bimbisara) ఆగస్ట్ 5న విడుదల కానుంది. వశిష్ట రూపొందించిన చిత్రమిది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన బిజీగా ఉన్నారు. అయితే `బింబిసార` తనకు చాలా ప్రత్యేకమైన మూవీ అని, కెరీర్‌ పరంగా ఇదొక మెమొరబుల్‌ మూవీ అని, అందుకే తన సినీ అనుభవాలను పంచుకుంటున్నట్టు తెలిపారు కళ్యాణ్‌ రామ్‌. ఇందులో ఆయన చెబుతూ, తన ఏడవ తరగతి చదువుకునే టైమ్‌లోనే సినీ ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పారు. 

కళ్యాణ్‌ రామ్‌ తన అనుభవాలను పంచుకుంటూ, `1989వ సంవత్సరం అది. సెనెన్త్ క్లాస్‌ చదువుతున్నా. ఓరోజు బాలయ్య బాబాయ్‌ వచ్చి కళ్యాణ్‌ ని సినిమాల్లో పరియం చేస్తాను అన్నయ్య, చైల్డ్ క్యారెక్టర్‌ ఉందని నాన్న(హరికృష్ణ)తో చెప్పారు. చదువుకునే టైమ్‌లో సినిమాలంటే వ్యాపకం మారిపోతుందేమో అని నాన్న ఆందోళన చెందారు. కానీ బాబాయ్‌ భరోసా ఇచ్చారు. వర్రీ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. అప్పటికీ నాకు కెమెరా తెలియదు, దాన్నిఎలా ఫేస్‌ చేయాలో కూడా తెలియదు. మొత్తంగా నటుడిని అపోయా` అని చెప్పుకొచ్చారు కళ్యాణ్‌ రామ్‌. 

`ఓ రకంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేసినట్టు నాకు సినిమాల్లో బాలయ్య బాబాయ్‌ అక్షరాభ్యాసం చేశారు. ఆ సినిమానే `బాలగోపాలుడు`. అలా నా సినీ జీవితం ప్రారంభమైంది. హీరోగా మొదటి సినిమా `తొలి చూపులోనే`. కాశీ విశ్వనాథ్‌ దర్శకుడు.రామోజీరావుగారు నిర్మాత. అలా నా సినీ ప్రస్తావన ప్రారంభమైంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీ అందరికి తెలుసు. `తొలి చూపులోనే`, `అభిమన్యు` సినిమాలు పెద్దగా ఆడలేదు. అప్పుడు ఫస్ట్ టైమ్ ఫెయిల్‌ అయిన ఫీలింగ్‌ కనిపించింది. దాంతో ఎలా చేయాలనేదానిపై రియలైజ్‌ అయ్యాను. ఏం చేయాలి, ఏం నిరూపించుకోవాలనేదిపై ఫోకస్‌ పెట్టాను.అప్పుడు సినిమా అంటే ఏంటి? అనే జీల్‌ మొదలైంది` అని వెల్లడించారు.

`సినిమాల ఫెయిల్యూర్‌ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నాను. పెయిల్యూర్‌ నాకు సినిమాపై ఫ్యాషన్‌ పెరిగేలా చేసింది. బ్యానర్‌(ఎన్టీఆర్‌ ఆర్ట్స్) స్థాపించాక నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం చేశాను. ఆ టైమ్‌లో చేసిన `అతనొక్కడే` చిత్రంతో ఎంతో నేర్చుకున్నారు. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ వచ్చింది. త్రీడీ వచ్చింది. `అవతార్‌` లాంటి సినిమాలొచ్చాయి. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడు తెలుగులో సినిమాల్లో త్రీడీని పరిచయం చేస్తూ `ఓం` సినిమాని తీశాను. ఆశించిన సక్సెస్‌ దొరకలేదు. చాలా బాధపడ్డాను. దాని తర్వాత `పటాస్‌` లాంటి సినిమాలుచేసుకుంటూ వచ్చాను`. 

YouTube video player

`ఈ రోజుల్లో సినిమా మేకింగ్‌ మారిపోయింది. తెలుగు సినిమాలు భారీ స్థాయిలో పెరిగాయి. `బాహుబలి` సినిమా తెలుగు సినిమాకి ఒక గర్వకారణమైన మూవీ. పాన్‌ వరల్డ్ కి పరిచయం చేసింది. ఇంతలో కరోనా పాండమిక్‌ వచ్చింది. దీంతో ఇండస్ట్రీ మొత్తం స్లో అయిపోయింది. ఆ తర్వాత థియేటర్‌కి జనం వస్తారా? అనే సందిగ్దంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` వచ్చి ఆడియెన్స్ ని థియేటర్‌కి తీసుకొచ్చింది. ఇందులో తారక్‌(NTR), రామ్‌చరణ్‌ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కొమురం భీమ్‌ పాత్రలో తారక్‌ అదరగొట్టారు` అని చెప్పారు కళ్యాణ్‌ రామ్‌. అంతలోనే ఎన్టీఆర్‌ నుంచి ఫోన్‌ రావడంతో దీన్ని మరో వీడియోలో కంటిన్యూ చేద్దామని తెలిపారు కళ్యాణ్‌ రామ్‌. మరి మున్ముందు ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తారనేది చూడాలి.