బింబిసార సినిమాని అప్పుడు దిల్ రాజు రిలీజ్ చేసారు. ఇప్పుడు డెవిల్ చిత్రం ట్రైలర్ బాగా వర్కవుట్ కావటంలో ఈ సినిమా రైట్స్ ని సైతం దిల్ రాజు తీసుకున్నారని సమాచారం. 


కళ్యాణ్ రామ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ కు రెడీ అయ్యిన చిత్రం డెవిల్. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన మూవీ అంటే బింబిసార మాత్రమే . ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను సాధించి కళ్యాణ్ రామ్ కు మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. నిర్మాతలకు కూడా కళ్యాణ్ రామ్ సినిమా పై మంచి బడ్జెట్ పెట్టొచ్చు అనే నమ్మకాన్ని కల్పించిందీ సినిమా. బింబిసార సినిమాని అప్పుడు దిల్ రాజు రిలీజ్ చేసారు. ఇప్పుడు డెవిల్ చిత్రం ట్రైలర్ బాగా వర్కవుట్ కావటంలో ఈ సినిమా రైట్స్ ని సైతం దిల్ రాజు తీసుకున్నారని సమాచారం. వాస్తవానికి సలార్ రెండో వారం కాంపిటేషన్ ఈ చిత్రానికి ఉన్నా థియేటర్ బిజినెస్ బాగా చేసింది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రా [6 ఏరియాలు] డిస్టిబ్యూషన్ రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంద్రా బిజినెస్ 8.5 కోట్లకు పూర్తైంది. సీడెడ్ రైట్స్ 3.25 Cr. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ 18Cr ,ప్రపంచ వ్యాప్తంగా 21Cr అని తెలుస్తోంది.. ఏషియన్ సునీల్ నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

బింబిసార సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ‘డెవిల్’ అనే సినిమాని స్టార్ట్ చేశారు అభిషేక్ నామా. 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ కథను రెడీ చేశారట మేకర్స్. ఇందులో బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారని, ఆయన చేసే సాహసాలు అబ్బురపరుస్తాయని తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తీసారని సమాచారం.

అభిషేక్ నామా మాట్లాడుతూ..’ కళ్యాణ్ రామ్ గారికి అంత బడ్జెట్ పెట్టడానికి నేను ముందుకు రావడం వెనుక డెవిల్ కథ పుషింగ్ ఉంది తప్ప ఇంకేమీ కాదు. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. డెవిల్ కి సీక్వెల్ కూడా ఉంటుంది. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.