Asianet News TeluguAsianet News Telugu

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సెన్సార్ టాక్.. ప్లాన్ ప్రకారం రన్ టైమ్ పర్ఫెక్ట్ గా..

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

Kalyan ram amigos movie censor complete
Author
First Published Feb 6, 2023, 9:15 PM IST

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే తొలిసారి ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారు. ఆదివారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా కళ్యాణ్ రామ్ సోదరుడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. 

దీనితో అమిగోస్ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. బింబిసారా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఆ అంచనాలు కూడా ఓపెనింగ్స్ కి ఉపయోగపడనున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ అందించారు. 

Kalyan ram amigos movie censor complete

అమిగోస్ చిత్రానికి 2 గంటల 19 నిమిషాల పర్ఫెక్ట్ రన్ టైంని చిత్ర యూనిట్ లాక్ చేసింది. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ఇది. థ్రిల్లర్ చిత్రానికి ఈ రన్ టైంని లాక్ చేయడం సరైన నిర్ణయం అనే చెప్పాలి. ఇదిలా ఉండగా సెన్సార్ సభ్యులు కూడా ఈ చిత్రాన్ని చూసి థ్రిల్ ఫీల్ అయినట్లు తెలుస్తోంది. 

మ్యాజిక్ కనుక వర్కౌట్ అయితే థియేటర్స్ లో ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుంది అని అంటున్నారు. కళ్యాణ్ రామ్ కి జోడిగా యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ 'ఎన్నో రాత్రులొస్తాయి కానీ' సాంగ్ ని రీమిక్స్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios